ఫైనల్ మ్యాచ్ ఆడాలంటే నాలుగు మ్యాచ్ లు గెలవాల్సిందే 

ఫైనల్ మ్యాచ్ ఆడాలంటే నాలుగు మ్యాచ్ లు గెలవాల్సిందే 

బంగ్లాదేశ్ తో జరిగిన మొదటి టెస్ట్ లో టీం ఇండియా 188 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో ఇండియా రెండో ప్లేస్ కి దూసుకెళ్లింది. నిన్న ఆస్ట్రేలియా చేతిలో సౌత్ ఆఫ్రికా చిత్తుగా ఓడటం భారత్ కు ప్లస్ అయింది. దీంతో రెండో ప్లేస్ లో ఉన్న సౌత్ ఆఫ్రికాను వెనక్కి నెట్టి భారత్ ముందుకు వెళ్లింది.

ప్రస్తుతం భారత్ 55.77 పర్సెంటేజ్, 87 పాయింట్లతో టేబుల్ లో రెండో స్థానంలో కొనసాగుతుంది. మొదటి స్థానంలో ఆస్ట్రేలియా 76.92 పర్సెంటేజ్, 120 పాయింట్స్ తో ఉంది. అయితే, వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ కి అర్హత సాధించాలంటే భారత్ తర్వాత ఆడనున్న 5 టెస్ట్ మ్యాచ్ ల్లో నాలుగింటిలో గెలవాలి. సౌత్ ఆఫ్రికా కనీసం ఒక్క సిరీస్ అయినా ఓడిపోవాల్సి ఉంటుంది.