
న్యూఢిల్లీ: పాక్ దాడులకు కౌంటర్‌గా భారత్ ప్రతి దాడులకు దిగింది. పాక్ రాజధాని ఇస్లామాబాద్, లాహోర్, సియోల్ కోట, బహల్వాల్పూర్పై మెరుపు దాడులు చేసింది. డ్రోన్లు, మిస్సైళ్లతో విరుచుకుపడింది. మరోవైపు భారత్‌పై దాడులకు ప్రయత్నించిన పాక్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన మూడు యుద్ధ విమానాలను భారత సైన్యం కూల్చి వేసింది. ఒక ఎఫ్ 16 ఫైటర్ జెట్, రెండు JF-17 యుద్ధ విమానాలను భారతదేశ S-400 వైమానిక రక్షణ వ్యవస్థ నేలమట్టం చేసింది.
ఈ యుద్ధ విమానాలు తమ పరిధి దాటి భారత్ లోకి ప్రవేశించడంతో ఇండియన్ ఆర్మీ కూల్చివేశాయి. వీటితో పాటు పలు చోట్ల పాక్ డ్రోన్లను కూడా భారత సైన్యం నేలమట్టం చేసింది. ఉధంపూర్, జమ్మూ, అఖ్నూర్, పఠాన్‌కోట్, పోఖ్రాన్, జమ్మూ విశ్వవిద్యాలయం సమీపంలో డ్రోన్‌లను వైమానిక రక్షణ వ్యవస్థ ధ్వంసం చేసింది.
ALSO READ | బోర్డర్లో పాక్ మెరుపు దాడులు.. త్రివిధ దళాధిపతులతో రాజ్‌నాథ్ సింగ్ అత్యవసర భేటీ
కాగా, ఆపరేషన్ సిందూర్‌కు ప్రతీకారంగా గురువారం (మే 8) రాత్రి పాక్ మెరుపు దాడులకు దిగింది. సరిహద్దు రాష్ట్రాల్లో మిసైళ్లు, డ్రోన్లతో దాడులు చేసింది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలపై దాడులకు యత్నించింది. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ టార్గెట్‌గా దాడులు చేసింది. పాక్ దాడులతో వెంటనే అప్రమత్తమైన భారత సైన్యం ధీటుగా తిప్పికొట్టింది. భద్రతా చర్యల్లో భాగంగా సరిహద్దు జిల్లాలో పూర్తిగా బ్లాక్ ఔట్ ప్రకటించింది.