
వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా రెండో రోజు కూడా ఆధిపత్యం చూపిస్తోంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో తొలి రోజు బౌలింగ్ లో సత్తా చాటిన గిల్ సేన.. రెండో రోజు బ్యాటింగ్ లో అద్భుతంగా రాణిస్తూ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తుంది. రాహుల్ సెంచరీ (100)తో పాటు గిల్ (50), జురెల్, జడేజా హాఫ్ సెంచరీలు చేయడంతో తొలి ఇన్నింగ్స్ లో ఇండియా భారీ స్కోర్ దిశగా వెళ్తుంది. రెండో రోజు టీ విరామానికి 4 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. క్రీజ్ లో వికెట్ కీపర్ జురెల్ (68), జడేజా (50) ఉన్నారు. ప్రస్తుతం ఇండియా తొలి ఇన్నింగ్స్ లో 164 పరుగుల ఆధిక్యంలో ఉంది.
3 వికెట్ల నష్టానికి 218 పరుగులతో రెండో సెషన్ ప్రారంభించిన టీమిండియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. స్పిన్నర్ వారికన్ బౌలింగ్ లో రాహుల్ స్లిప్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ దశలో టీమిండియాను ముందుకు తీసుకెళ్లే బాధ్యత జురెల్, జడేజా తీసుకున్నారు. వీరిద్దరూ జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్ ను నిర్మించారు. ఐదో వికెట్ కు అజేయంగా 108 పరుగులు నెలకొల్పారు. ఈ క్రమంలో జురెల్, జడేజా ఇద్దరూ తమ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఓవరాల్ గా ఈ సెషన్ లో ఇండియా 108 పరుగులు చేసి ఒక వికెట్ మాత్రమే కోల్పోయింది.
రెండు వికెట్ల నష్టానికి 121 పరుగులతో రెండో రోజు ఆట ప్రారంభించిన ఇండియా ఇన్నింగ్స్ ను కెప్టెన్ గిల్, రాహుల్ ముందుకు తీసుకెళ్లారు. తొలి అరగంట జాగ్రత్తగా ఆడుతూ డిఫెన్స్ కే పరిమితమయ్యారు. తొలి గంట ముగిసిన తర్వాత గిల్, రాహుల్ జోరు పెంచారు. బౌండరీలు కొడుతూ స్కోర్ కార్డును వేగంగా ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో గిల్ 94 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. 50 కొట్టిన వెంటనే రివర్స్ స్వీప్ చేసే క్రమంలో గిల్ స్లిప్ లో దొరికిపోయాడు. దీంతో రాహుల్, గిల్ మధ్య 98 పరుగుల భాగస్వామ్యానికి తెర పడింది.
ALSO READ : కోహ్లీ, రోహిత్ వచ్చేస్తున్నారు..
గిల్ ఔటైన తర్వాత వికెట్ కీపర్ జురెల్ తో కలిసి రాహుల్ తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఛేజ్ బౌలింగ్ లో సింగిల్ తీసుకొని తన 100 పరుగుల మార్క్ అందుకున్నాడు. లంచ్ కు వరకు జురెల్, రాహుల్ వికెట్ పడకుండా తొలి సెషన్ ముగించారు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు అజేయంగా 30 పరుగులు జోడించారు. ఈ సెషన్ లో టీమిండియా 29 ఓవర్లు ఆడి 97 పరుగులు చేసి గిల్ వికెట్ కోల్పోయింది. వెస్టిండీస్ బౌలర్లలో ఛేజ్ రెండు వికెట్లు పడగొట్టాడు. సీల్స్ కు ఒక వికెట్ దక్కింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ తమ తొలి ఇన్నింగ్స్ లో 162 పరుగులకే ఆలౌట్ అయింది.
That's Tea on Day 2
— BCCI (@BCCI) October 3, 2025
Impressive fifties from Dhruv Jurel and Ravindra Jadeja take #TeamIndia's lead to 164 runs 👏
We will resume with the last session shortly
Updates ▶️ https://t.co/MNXdZcelkD#INDvWI | @IDFCFIRSTBank pic.twitter.com/aWWVFw9czz