ఓరి దేవుడా : 2050 నాటికి దేశంలో సగం మందికి మంచినీటి కష్టాలు

ఓరి దేవుడా : 2050 నాటికి దేశంలో సగం మందికి మంచినీటి కష్టాలు

నీరు ప్రతి ఒక్క జీవికి జీవనాధారం. అవి లేకపోతే ఏ ప్రాణి జీవించలేదు. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో నీరు దొరక్క ప్రజలు అవస్థలు పడుతూ ఉంటారు. నీటి కోసం కిలోమీటర్లు దూరం నడవడం, బావిలో నుంచి అడుగున ఉన్న నీటిని తోడుకోవడం లాంటి ఘటనలు ఎన్నో చూశాం. అలాగే వేసవి కాలంలో కూడా చాలామంది నీరు దొరక్క ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి తరుణంలో ఓ సంస్థ ఆందోళన కలిగించే విషయాలు బయటపెట్టింది. 2050 నాటికి భారతదేశంలో 50 శాతం జిల్లాల ప్రజలు  తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటారని ఆ నివేదికలో వెల్లడిచింది. ప్రపంచ పట్టణ జనాభా రోజురోజుకు పెరుగుతోంది. 2016లో దాదాపు 93 కోట్ల మంది నీటి కొరతను ఎదుర్కొన్నారు. అప్పటి నుంచి ఈ సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతూ వస్తోంది. అయితే 2050 నాటికి ఈ సంఖ్య 170 కోట్ల నుంచి 240 కోట్ల వరకు చేరుకుంటుంది.దీనివల్ల భారత్ తీవ్రంగా నీటి ప్రభావాన్ని చవిచూస్తుందని పేర్కొంది.

2050 నాటికి భారతదేశంలో ప్రతి వ్యక్తి దాదాపు 15 శాతం నీటి కొరతను ఎదుర్కొనే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.  అంతే కాకుండా ఆ సమయానికి నీటి వాడకం 30 శాతం పెరుగుతుందని... సరిపడా నీటి లభ్యత లభించకపోవడంతో .. ప్రజలు తీవ్రమైన నీటి సమస్యను ఎదుర్కొంటారని అంచనా వేశారు. భారతదేశంలో 17 శాతం మందికి సరిపడ నీరు లభిస్తుందని ... అందులోనూ స్వచ్చమైన నీరు 4 శాతం మాత్రమే లభిస్తుందని నివేదికలో పేర్కొన్నారు. 

భారతదేశంలో అధికంగా వ్యవసాయ రంగానికి నీరు కేటాయించడంతో నీటి ఎద్దడికి ప్రధాన కారణమని నిపుణులు అంటున్నారు.  రైతులకు నీటిని రిజర్వాయర్ల ద్వారా అందిస్తారు.  అన్ని వనరుల నుంచి 90 శాతం నీటిని ఉత్పత్తి చేస్తే అందులో 84 శాతం నీటిని వ్యవసాయానికి కేటాయిస్తున్నారు.భారతదేశంలో అధికంగా అంటే 90 శాతం మంది రైతులు  వరి, చెరకు, గోధుమలు పండిస్తారు.  ఈ పంటలకు నీటి వినియోగం చాలా ఎక్కువ.  

ప్రస్తుతం ప్రపంచ జనాభాలో మూటింట రెండు వంతుల మంది నీటి సంక్షోభాన్ని  ఎదుర్కొంటున్నారని ట్రాన్స్‌ఫార్మింగ్ క్రాప్ కల్టివేషన్ నివేదిక తెలిపింది.  వ్యవసాయ రంగానికి నీటి సామర్ధ్యాన్ని పెంచే విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.  పర్యవరణ వ్యవస్థలో జరుగుతున్న మార్పులను  DCM శ్రీరామ్  మరియు  సత్వ జ్ఞాన సంస్థాన్‌ల  నివేదికను DCM శ్రీరామ్ ఫౌండేషన్ వెల్లడించింది. 

ALSO READ : ఉల్లి రైతుల ఉద్యమం.. ఓటు వేయం అంటూ తిరుగుబాటు

భారతదేశంలో పెరుగుతున్న జనాభా... కాలుష్య ప్రభావాల వలన నీటి వనరులపై ఒత్తిడి పెరుగుతుందని ఫాల్కెన్‌మార్క్ ఇండెక్స్ తెలిపింది.  ఒక్కొక్కరు ఏడాదికి  సుమారు1700 క్యూబిక్​ మీటర్ల నీరు అవసరమవుతుందని నివేదిక తెలిపింది.  ప్రస్తుతం దేశ జనాభాలో 76 శాతం మంది నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని ఫాల్కెన్‌మార్క్ ఇండెక్స్ నివేదిక పేర్కొంది. ఇక వ్యవసాయ రంగానికి 80 నుంచి 90 శాతం నీటిని కేటాయించడం కొంత ఆందోళన కరంగా మారుతుంది.  అంతే కాకుండా భూగర్భ జలాలనుంచి నీరు ఉత్పత్తి  కాకపోవడంతో నీటి ఎద్దడి సమస్య తీవ్రరూపం దాలుస్తుందని ఫాల్కెన్‌మార్క్ ఇండెక్స్ నివేదిక ద్వారా తెలుస్తోంది.