IND vs AUS: నాథన్‌ లియాన్‌ మ్యాజిక్..4 వికెట్లు కోల్పోయిన టీమిండియా

IND vs AUS: నాథన్‌ లియాన్‌ మ్యాజిక్..4 వికెట్లు కోల్పోయిన టీమిండియా

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ రెండవ టెస్టులో భాగంగా రెండవరోజు భారీ అంచనాలతో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియాకు ఆట మొదలైన గంటలోపే భారీ షాక్ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ (32), కేఎల్ రాహుల్ (17), వన్ డౌన్ లో వచ్చిన పుజారా (0) వెంట వెంటనే ఔట్ అయ్యారు. ఐదో వికెట్లో వచ్చిన శ్రేయస్ అయ్యర్ (4) కూడా తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు.   ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఓపెనర్లు, నాథన్ లియాన్ స్పిన్ ముందు ఎక్కువసేపు నిలువలేకపోయారు. నాలుగో వికెట్లో వచ్చిన కోహ్లీతో కలిసి ఇన్నింగ్స్ నిలబెడతాడనుకున్న పుజారా డక్ ఔట్ గా వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన శ్రేయస్ ని కూడా నాథన్ బోల్తా కొట్టించాడు. నాలుగు కీలకమైన వికెట్లు కోల్పోయేసరికి టీమిండియా ఆట కాస్త నెమ్మదించింది. క్రీజులో ఉన్న బ్యాటర్ విరాట్ కోహ్లీ (9), జడేజాతో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా పడాల్సి ఉంది. ప్రస్తుతం భారత్ స్కోరు 67/4. నాథన్ లియాన్ 4 వికెట్లు పడగొట్టాడు.