ఫిఫా వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ క్వాలిఫయర్స్ రెండో రౌండ్‌‌‌‌లో ఇండియా ఓటమి

ఫిఫా వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ క్వాలిఫయర్స్ రెండో రౌండ్‌‌‌‌లో ఇండియా ఓటమి

భువనేశ్వర్‌‌‌‌: ఫిఫా వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ క్వాలిఫయర్స్ రెండో రౌండ్‌‌‌‌లో టోర్నమెంట్   ఇండియాకు చుక్కెదురైంది. మంగళవారం జరిగిన గ్రూప్‌‌‌‌–ఎ రెండో మ్యాచ్‌‌‌‌లో ఇండియా 0–3తో ఖతార్‌‌‌‌ చేతిలో ఓడింది. ఖతార్‌‌‌‌ తరఫున మౌస్తఫా టారెక్‌‌‌‌ (4వ ని.), అల్మోజ్‌‌‌‌ అలీ (47వ ని.), యూసుఫ్‌‌‌‌ అబ్దుర్‌‌‌‌సాగ్‌‌‌‌ (86వ ని.) గోల్స్‌‌‌‌ చేశారు. తొలి మ్యాచ్‌‌‌‌లో కువైట్‌‌‌‌పై నెగ్గిన టీమిండియా అదే మ్యాజిక్‌‌‌‌ను రిపీట్‌‌‌‌ చేయలేకపోయింది. 

ప్రస్తుతం ఈ గ్రూప్‌‌‌‌లో ఇండియా 3 పాయింట్లతో రెండో ప్లేస్‌‌‌‌లో కొనసాగుతున్నది. ఆట ఆరంభంలో ఇండియా ఎక్కువ డిఫెన్స్‌‌‌‌కు ప్రాధాన్యమివ్వడంతో ఖతార్‌‌‌‌కు కలిసొచ్చింది. షార్ట్‌‌‌‌ పాస్‌‌‌‌లతో ఖతార్‌‌‌‌ ఫార్వర్డ్స్‌‌‌‌ గోల్స్‌‌‌‌ చేసే చాన్స్‌‌‌‌ను సృష్టించారు. దీంతో 5వ నిమిషంలోనే మౌస్తఫా కొట్టిన క్రాస్‌‌‌‌ షాట్‌‌‌‌ గోల్ పోస్ట్‌‌‌‌లోకి వెళ్లింది. తర్వాత స్కోరును సమం చేసేందుకు ఇండియాకు రెండు అవకాశాలు వచ్చినా అపియా, థాపా వృథా చేశారు. 

సెకండ్‌‌‌‌ హాఫ్‌‌‌‌లో అల్మోజ్‌‌‌‌ ఎదురుదాడికి దిగడంతో ఇండియా సమర్థంగా తిప్పికొట్టినా గోల్స్‌‌‌‌ చేసే అవకాశాలను క్రియేట్‌‌‌‌ చేయలేకపోయింది. ఆట చివర్లో వరుసగా దాడులు చేసిన ఖతార్‌‌‌‌ 86వ నిమిషంలో థర్డ్‌‌‌‌ గోల్ చేసి ఆధిక్యాన్ని మరింత పెంచుకుంది. మార్చి 21న జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో ఇండియా.. అఫ్గానిస్తాన్‌‌‌‌తో తలపడుతుంది.