సాఫీగా ఎల్పీజీ సరఫరా.. ఇరాన్ నుంచి రెండు నౌకల రాక

సాఫీగా ఎల్పీజీ సరఫరా.. ఇరాన్ నుంచి రెండు నౌకల రాక

న్యూఢిల్లీ: పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎల్​పీజీ సరఫరా నిరంతరాయంగా కొనసాగుతోంది. హోర్మూజ్ జలసంధిని దాటుకుని గ్రీన్ సాన్వి అనే భారతీయ నౌక క్షేమంగా బయటపడింది. ఇందులో 46,650 టన్నుల వంటగ్యాస్ ఉంది. మరోవైపు ఇరాన్ నుంచి వచ్చిన సీ బర్డ్ నౌక 44 వేల టన్నుల ఎల్​పీజీతో మంగళూరు పోర్టుకు చేరుకుంది. ఏడేళ్ల విరామం తర్వాత ఇరాన్ నుంచి ఇంధన కొనుగోలు జరగడం గమనార్హం. అమెరికా ఆంక్షల నుంచి తాత్కాలిక మినహాయింపు ఇవ్వడంతో ఈ దిగుమతులు సాధ్యమయ్యాయి.

భారత్ తన అవసరాల కోసం 60 శాతం ఎల్​పీజీని దిగుమతులపైనే ఆధారపడుతోంది. అందులో 90 శాతం మిడిల్​ఈస్ట్​ దేశాల నుంచే వస్తోంది. యుద్ధ వాతావరణం వల్ల గతంలో సరఫరాకు ఆటంకం కలిగింది. తాజాగా వచ్చిన నౌకలతో దేశంలో వంటగ్యాస్ కొరత తీరే అవకాశం ఉంది. ప్రస్తుతం 17 భారతీయ నౌకలు గల్ఫ్ ప్రాంతంలో ఉన్నాయి. వీటి భద్రతను షిప్పింగ్ మంత్రిత్వ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తోంది. భారతీయ సిబ్బంది అందరూ క్షేమంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. దీనివల్ల దేశీయంగా ఇంధన నిల్వలు పెరిగే అవకాశం ఉంది.