
లగ్జరీ కార్ల కంపెనీ రోల్స్ రాయ్స్ ఇండియా మార్కెట్లోకి కలీనన్ కారును తీసుకొచ్చింది. చెన్నైలో గురువారం జరిగిన కార్యక్రమంలో కంపెనీ పెద్దాఫీసర్లు దీనిని విడుదల చేశారు. కలీనన్ ధర రూ.8.2 కోట్ల నుంచి మొదలవుతుంది. ఈ కారు ఐదు సెకన్లలో 100 కిలోమీటర్ల వేగం అందుకుంటుంది. ఇందులో ట్విన్ టర్బోచార్జ్డ్ వీ12 6,751 సీసీ ఇంజన్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, ఏబీఎస్, ఎలక్ట్రానిక్ బ్రేక్ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, బ్రేక్ అసిస్ట్, ఇంజన్ ఇమ్మోబలైజర్, చైల్డ్ సేఫ్టీ లాక్, క్రూజ్ కంట్రోల్ వంటి సదుపాయాలు ఉన్నాయి.