తీవ్రమైన ఆర్థికమాంద్యం తప్పదు

తీవ్రమైన ఆర్థికమాంద్యం తప్పదు

న్యూఢిల్లీ : లాక్ డౌన్ పొడగింపు కారణంగా దేశంలో తీవ్రమైన ఆర్థిక మాంద్యం తప్పదని ఎకానమిస్ట్ లు చెబుతున్నారు. 21 రోజుల నుంచి 40 రోజుల వరకు లాక్ డౌన్ చేయటం కారణంగా మ్యానుఫాక్చర్ సెక్టార్ 8 శాతం కన్నా ఎక్కువగా లాస్ అవుతందని అంచనా వేస్తున్నారు. గత 40 ఏళ్లలో ఎప్పుడూ లేని ఒడిదొడుకులు ఎదుర్కొక తప్పదంట. అన్ ఆర్గనైజ్డ్ సెక్టార్ లో ఉన్న లక్షలాది మంది ఉపాధి కోల్పోతారని నోమురా హోల్డింగ్స్ కార్పొరేషన్ ఎకానమిస్ట్ సోనాల్ వర్మ తెలిపారు. 2021 మార్చి నాటికి మనదేశం జీడీపీ 0.4 శాతం తగ్గుతుందని వర్మ చెప్పారు. మొత్తం ఏడాదంతా ఎకానమీ ఎఫెక్ట్ అవటంతో 40 ఏళ్లలో ఎప్పుడూ లేనంత వరస్ట్ సిచ్యూవేషన్స్ ఉంటాయని సోషియేట్ జనరల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అంచనా వేసింది. 1980 లో మనదేశం జీడీపీ 5.2 శాతం తగ్గింది. మళ్లీ ఈ ఏడాది అలాంటి పరిస్థితులు ఉంటాయని తెలిపింది. లాక్ డౌన్ తర్వాత పరోక్షంగా లక్షలాది మంది పై ఈ ఎఫెక్ట్ ఉంటుందని…దానిపై ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయని ఎకానమిస్ట్ సోనాల్ వర్మ చెప్పారు. ద్రవ్యోల్బణం తీవ్రస్థాయికి చేరుకుంటుందని అది చాలా మధ్యతరగతి కుటుంబాలను ఎఫెక్ట్ చేస్తుందని సెంటర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ మేనేజింగ్ డైరెక్టర్ మహేష్ వ్యాస్ తెలిపారు. ఇక బ్లూమ్ బర్గ్ సంస్థ భారత్ లో తీవ్రమైన ఆర్థిక మాంద్యం అనివార్యమని హెచ్చరించింది. 2021 లో ఇండియా జీడీపీ అంచనాకు 4.7 కు తగ్గించుకుంటున్నామని తెలిపింది. అంతకుముందు 6 శాతంగా అంచనా వేశారు. కరోనా ఎఫెక్ట్ కారణంగా ఏర్పడిన పరిస్థితులతో అంచనాలను రివైజ్ చేస్తున్నామని తెలిపింది.