ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో ఓడిన ఇండియా టీటీ టీమ్స్

ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో ఓడిన ఇండియా టీటీ టీమ్స్

బుసాన్ (సౌత్ కొరియా) :  వరల్డ్ టేబుల్ టెన్నిస్ టీమ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్స్‌‌‌‌‌‌‌‌లో ఇండియా మెన్స్, విమెన్స్ టీమ్స్ పోరాటం ముగిసింది. రెండు జట్లూ బుధవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఓడి ఇంటిదారి పట్టాయి. అయినా ఇరు జట్లూ పారిస్ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌కు క్వాలిఫై కానున్నాయి. మనికా బత్రా నేతృత్వంలోని విమెన్స్‌‌‌‌‌‌‌‌ టీమ్  1–3తో చైనీస్ తైపీ చేతిలో ఓడిపోయింది. మెన్స్‌‌‌‌‌‌‌‌ టీమ్ 0–3తో సౌత్ కొరియా చేతిలో చిత్తయింది. ఈ టోర్నీలో క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌ చేరిన జట్లకు నేరుగా పారిస్ ఒలింపిక్ బెర్తు లభించింది. అయితే, ఇండియా జట్లు తమ వరల్డ్ ర్యాంకింగ్స్ ఆధారంగా ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌కు క్వాలిఫై కానున్నాయి. మెన్స్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ ప్రస్తుతం 15వ ర్యాంక్‌‌‌‌‌‌‌‌లో ఉండగా.. విమెన్స్‌‌‌‌‌‌‌‌ టీమ్ 17వ స్థానంలో నిలిచింది. వరల్డ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్స్‌‌‌‌‌‌‌‌ పాయింట్లను కలిపి మార్చి5న పారిస్ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌కు అర్హత సాధించే జట్లను అధికారికంగా ప్రకటించనున్నారు.