ట్రంప్పై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అమెరికా సంస్థలదే

ట్రంప్పై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అమెరికా సంస్థలదే

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై  నేరారోపణలపై భారత విదేశీ వ్యవహారాల శాఖ స్పందించింది. ఈ వ్యవహారాన్ని  కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ  తెలిపింది. ట్రంప్ పై నమోదైన అభియోగాలను గమనించాలని కోరినట్లు పేర్కొంది. ఈ వ్యవహారంలో తదుపరి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అమెరికాలోని విచారణ సంస్థలదే అని పేర్కొంది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. 

అమెరికా చరిత్రలోనే ఒక మాజీ అధ్యక్షుడు అరెస్టు అవడం ఇదే మొదటిసారి. 2016లో  హుష్ మనీ కేసులో ఆయన పై మాన్ హాట్టన్ కోర్టులో 34 అభియోగాలు నమోదయ్యాయి. 2016 ఎన్నికల ముందు స్మార్టీ  డేనియల్తో ఉన్న  శృంగార సంబంధాన్ని దాచిపెట్టేందుకు పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చినట్లు ట్రంప్ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. 

లేక్ తాహో అనే హోటల్లో తనతో ట్రంప్  శృంగారంలో పాల్గొన్నాడని స్టార్మీ డేనియల్స్ స్వయంగా వెల్లడించింది. తనతో శృంగారంలో పాల్గొన్న విషయాన్ని  బయటకు చెప్పకుండా ఉండేందుకు ట్రంప్.. 2016 అధ్యక్ష ఎన్నికలకు నెల రోజుల ముందు ఆయన వ్యక్తిగత అడ్వకేట్ కోహెన్ ద్వారా తనకు కు 1.30 లక్షల అమెరికా డాలర్లు ముట్టజెప్పినట్లు వెల్లడించింది. 
 
ఈ వ్యవహారం తర్వాత న్యూయార్క్ పోలీసులు ట్రంప్ ను అరెస్ట్ చేశారు. తనపై అభియోగాలపై స్పందించిన డొనాల్డ్ ట్రంప్.. తనకు ఆ శృంగార నటికి ఎటువంటి లైంగిక సంబంధాలు లేవన్నాడు. అంతేకాదు తనను దోషిగా ప్రకటించవద్దని కోర్టును కోరారు.