
మొబైల్ ఫోన్ మార్కెట్లో యాపిల్ ఐఫోన్కు ఉన్న క్రేజే వేరు. యాపిల్ కంపెనీ నుంచి కొత్త మొబైల్ వస్తుందంటే చాలు కుర్రకారు వెర్రెక్కిపోయి మరీ ఆ కొత్త ఫోన్ కొనేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఐఫోన్ సంపన్నులు మాత్రమే కొనగలరనే అభిప్రాయం ఒకప్పుడు ఉండేది. కానీ.. ఇప్పుడు మిడిల్ క్లాస్ అబ్బాయిలు, అమ్మాయిలు కూడా అలవోకగా ఐఫోన్ కొనుక్కుంటున్నారు. ఈఎంఐ పెట్టేసుకుని ఐఫోన్ను సొంతం చేసుకుంటున్నారు. అయితే.. ఇటీవలే యాపిల్ కంపెనీ విడుదల చేసిన ఐఫోన్ 17 ప్రో గురించి తాజాగా ఒక విషయం తెలిసింది. ఐఫోన్ 17 ప్రో కొనాలంటే ఇండియాలో సగటు వేతనం పొందే ఒక వ్యక్తి 160 ఫుల్ వర్కింగ్ డేస్ పనిచేయాల్సిందేనని తేలింది. ఇదేం లెక్క అంటే.. డీటైల్డ్గా చెప్పాలంటే.. ఇండియాలో ఐఫోన్ 17 ధర 82 వేల 900 రూపాయలు ఉంది.
భారతదేశంలో సగటు వేతనం ప్రస్తుతం 518 రూపాయలుగా ఉంది. ఈ లెక్కన చూసుకుంటే.. ఐఫోన్ 17 కొనడానికి కావాల్సిన 82 వేల 900 రూపాయలు సంపాదించడానికి 160 రోజులు.. రోజుకు 8 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. అంతేకాదు.. ఈ 160 రోజుల సంపాదనలో ఒక్క పైసా కూడా ఖర్చుపెట్టకుండా ఉంటేనే ఐఫోన్ 17 కొనే స్థోమత ఉంటుంది. అంటే.. దాదాపు ఐదు నెలలకు పైగా పైసాపైసా కూడబెడితేనే ఒక సగటు భారతీయుడు ఐఫోన్ 17 కొనే పరిస్థితి ఉంటుంది. కొన్ని దేశాల్లో మాత్రం రెండు వారాలు పనిచేస్తే చాలు.. ఐఫోన్ 17 మోడల్ను సొంతం చేసుకోవచ్చు. World of Statistics (‘వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్’) అనే ‘ఎక్స్’ ఖాతాలో ఈ డేటాను పోస్ట్ చేశారు. ఒక్కసారి ఈ డేటాపై లుక్కేద్దాం..
ఏఏ దేశాల్లో సగటున ఎన్ని రోజులు పనిచేస్తే iPhone 17 కొనొచ్చంటే..
* లగ్జంబర్గ్ 3 రోజులు
* స్విట్జర్లాండ్: 3 రోజులు
* అమెరికా: 4 రోజులు
* బెల్జియం: 4 రోజులు
* డెన్మార్క్: 4
* నెదర్లాండ్స్: 4
* నార్వే: 4
* ఆస్ట్రేలియా: 5
* ఫిన్ ల్యాండ్: 5
* ఆస్ట్రియా: 5
* ఐర్లాండ్: 5
* జర్మనీ: 5
* కెనడా: 5
* ఫ్రాన్స్: 6
* స్వీడన్: 6
* యునైటెడ్ కింగ్డమ్: 7
* న్యూజిలాండ్: 7
* సింగపూర్: 8
* ఇటలీ: 8
* యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్: 8
* స్పెయిన్: 9
* చెకియా: 12
* పోలాండ్: 17
* పోర్చుగల్: 24
* హంగేరి: 27
* చిలీ: 32
* మలేషియా: 45
* థాయ్లాండ్: 61
* బ్రెజిల్: 77
* తుర్కియే: 89
* వియత్నాం: 99
* ఫిలిప్పైన్స్: 101
* ఇండియా: 160
Working days needed to buy the new iPhone 17 Pro (256 GB):
— World of Statistics (@stats_feed) September 13, 2025
🇱🇺 Luxembourg: 3
🇨🇭 Switzerland: 3
🇺🇸 United States: 4
🇧🇪 Belgium: 4
🇩🇰 Denmark: 4
🇳🇱 Netherlands: 4
🇳🇴 Norway: 4
🇦🇺 Australia: 5
🇦🇹 Austria: 5
🇫🇮 Finland: 5
🇮🇪 Ireland: 5
🇩🇪 Germany: 5
🇨🇦 Canada: 5
🇫🇷 France: 6
🇸🇪…