ప్రపంచ దేశాలతో పోలిస్తే.. మనం కరోనాను సమర్థంగా ఎదుర్కొంటున్నాం

ప్రపంచ దేశాలతో పోలిస్తే.. మనం కరోనాను సమర్థంగా ఎదుర్కొంటున్నాం
  • ప్రధాని నరేంద్ర మోడీ

న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలతో పోలిస్తే మనం కరోనా మహమ్మారిని నియంత్రణలో ముందు ఉన్నామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కరోనా వైరస్‌ కట్టడి కోసం మనం గట్టిగా రాడుతున్నామని అన్నారు. శనివారం రెవరండ్‌. జోసెఫ్‌ మార్‌‌తోనా 90వ జయంతిని పురస్కరించుకుని వీడియో కాన్పరెన్స్‌ ద్వారా మోడీ మట్లాడారు. మన దేశంలో రికవరీ రేటు రోజు రోజుకి పెరుగతోందని, ఇటలీ కంటే మన దేశంలో మరణాల రేటు చాలా తక్కువ అని అభిప్రాయపడ్డారు. భారత్‌ లాంటి దేశాల్లో కరోనా ఇంపాక్ట్‌ చాలా ఎక్కువగా ఉంటుందని చాలా మంది అన్నారని, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న లాక్‌డౌన్‌, వివిధ చర్యల వల్ల మనం ఇతర దేశాలతో పోలిస్తే చాలా బెటర్‌‌ ప్లేస్‌లో ఉన్నాం అని మోడీ అన్నారు. రెవరండ్‌. జోసెఫ్‌ మార్‌‌తోనా జయంతి సందర్భంగా వర్చువల్‌గా నిర్వహించిన ఈ కార్యక్రమంలో వేలాది మంది పాల్గొన్నారు.