ఫినిషింగ్ టచ్ అదిరింది: సిరీస్ మనదే

ఫినిషింగ్ టచ్ అదిరింది: సిరీస్ మనదే

అహ్మదాబాద్‌‌: టీ20 వరల్డ్‌‌కప్‌‌కు డ్రెస్‌‌ రిహార్సల్‌‌గా సాగిన సిరీస్‌‌లో ఇండియా దుమ్మురేపింది. ఒకటి, రెండు మ్యాచ్‌‌ల్లో నిరాశపర్చినా.. ఆఖరి ఫైట్‌‌లో మాత్రం చెలరేగిపోయింది.  కుర్రాళ్లతో భిన్నమైన లైనప్‌‌ను ఎంచుకుని అద్భుతమైన విజయాన్ని అందుకుంది. దీంతో శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా  36 రన్స్‌‌ తేడాతో ఇంగ్లండ్‌‌ను చిత్తు చేసింది.  ముందుగా బ్యాటింగ్‌‌ చేసిన ఇండియా 20 ఓవర్లలో 2 వికెట్లకు 224 రన్స్‌‌ చేసింది. కోహ్లీ, రోహిత్‌‌కు తోడుగా సూర్యకుమార్‌‌ యాదవ్‌‌ (17 బాల్స్‌‌లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 32), హార్దిక్‌‌ పాండ్యా (17 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 39 నాటౌట్‌‌) విజృంభించారు. తర్వాత ఇంగ్లండ్‌‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 188 రన్స్‌‌కే పరిమితమైంది. మలన్‌‌ (46 బాల్స్‌‌లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 68), బట్లర్‌‌ (34 బాల్స్‌‌లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 52) ఉన్నంతసేపు దడదడలాడించి గెలుపుపై ఆశలు పెంచారు. భువనేశ్వర్‌‌కు ‘మ్యాన్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’, కోహ్లీకి ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది. 
 

రోహిట్‌‌..

బ్యాటింగ్‌‌ పిచ్‌‌పై హిట్‌‌మ్యాన్‌‌ రోహిత్‌‌తో కలిసి కెప్టెన్‌‌ కోహ్లీ ఇన్నింగ్స్‌‌ ప్రారంభించాడు. ఫస్ట్‌‌ ఓవర్‌‌లో 3 రన్స్‌‌తోనే సరిపెట్టుకున్నా.. సెకండ్‌‌ ఓవర్‌‌ నుంచి రోహిత్‌‌ దుమారం మొదలైంది. ఈ ఓవర్‌‌లో చెరో ఫోర్‌‌ కొట్టగా, రషీద్‌‌ వేసిన థర్డ్‌‌ ఓవర్‌‌లో రోహిత్‌‌ మిడ్‌‌ వికెట్‌‌లో సూపర్‌‌ సిక్స్‌‌ సంధించాడు. తర్వాతి ఓవర్‌‌లో మరో రెండు ఫోర్లతో రెచ్చిపోయాడు. ఆరో ఓవర్‌‌ ఫస్ట్‌‌ బాల్‌‌ను కోహ్లీ లాంగాన్‌‌లో స్టాండ్స్‌‌లోకి పంపిస్తే, నాలుగో బాల్‌‌ను రోహిత్‌‌ ఫైన్‌‌ లెగ్‌‌లో సిక్సర్‌‌గా మలిచాడు. దీంతో పవర్‌‌ప్లేలో ఇండియా 60/0 స్కోరు చేసింది. ఛేంజ్‌‌ బౌలర్లుగా వచ్చిన జోర్డాన్‌‌ (0/57), కరన్‌‌ను  కూడా రోహిత్‌‌ వదిలిపెట్టలేదు. వరుస ఓవర్లలో రెండు సిక్సర్లు బాదేశాడు. స్టోక్స్​ వేసిన తొమ్మిదో ఓవర్‌‌లోనూ వరుసగా 6, 4 కొట్టిన రోహిత్‌‌.. లాస్ట్‌‌లో వేసిన లెగ్‌‌ కట్టర్‌‌ను అనూహ్యంగా వికెట్లపైకి ఆడి ఔటయ్యాడు. ఫలితంగా ఫస్ట్‌‌ వికెట్‌‌కు 56 బాల్స్‌‌లో 94 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. 

కోహ్లీ నిలకడ..

రోహిత్‌‌ ఔటైన తర్వాత కోహ్లీ యాంకర్‌‌ పాత్ర పోషించాడు. వచ్చీ రావడంతోనే స్టోక్స్‌‌ బౌలింగ్‌‌లో వరుస సిక్సర్లతో రెచ్చిపోయిన సూర్యకుమార్‌‌ ఎక్కడా తగ్గలేదు. దీంతో 10 ఓవర్లలోనే ఇండియా 110/1తో పటిష్ట స్థితిలో నిలిచింది. ఇక 12వ ఓవర్‌‌లో కోహ్లీ ఒకటి, సూర్య మూడు ఫోర్లు కొట్టడంతో 19 రన్స్‌‌ వచ్చాయి. నెక్స్ట్​ ఓవర్‌‌లో కోహ్లీ సిక్సర్‌‌ బాదగా, 14వ ఓవర్‌‌ సెకండ్‌‌ బాల్‌‌కు సూర్యకుమార్‌‌ ఔటయ్యాడు. ఫలితంగా సెకండ్‌‌ వికెట్‌‌కు 26 బాల్స్‌‌లో 49 రన్స్‌‌ భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో వచ్చిన పాండ్యా కూడా మెరిశాడు.  విరాట్‌‌ వేగం పెంచి బౌండ్రీల జోరు చూపడంతో36 బాల్స్‌‌లోనే ఫిఫ్టీ కంప్లీట్‌‌ అయ్యింది. 18వ ఓవర్‌‌లో కోహ్లీ మరో రెండు ఫోర్లు బాదితే, తర్వాతి ఓవర్‌‌లో పాండ్యా 6, 6, కోహ్లీ ఫోర్‌‌ కొట్టడంతో స్కోరు 200 దాటింది. లాస్ట్‌‌ ఓవర్‌‌లో కెప్టెన్‌‌ మరో రెండు ఫోర్లు రాబట్టాడు.  

130 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌..

భారీ టార్గెట్‌‌ ఛేదనలో ఇంగ్లండ్‌‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. సెకండ్‌‌ బాల్‌‌కే రాయ్‌‌ (0) ఔటైనా, బట్లర్‌‌, మలన్‌‌ స్టార్టింగ్‌‌ నుంచే దంచికొట్టారు. పాండ్యా వేసిన సెకండ్‌‌ ఓవర్‌‌లో మలన్‌‌ 4, 6, 4తో 18 రన్స్‌‌ పిండుకున్నాడు. పవర్‌‌ప్లేలో ఇంగ్లండ్‌‌ 62/1 స్కోరు చేసింది. 8వ ఓవర్‌‌లో స్పిన్నర్‌‌ రాహుల్‌‌ చహర్‌‌ ను తేవడంతో బట్లర్‌‌ లాంగాఫ్‌‌లో రెండు భారీ సిక్సర్లతో స్వాగతం పలికాడు. చహర్‌‌ తర్వాతి ఓవర్‌‌లోనూ బట్లర్‌‌ మరో సిక్సర్‌‌ కొట్టడంతో ఫస్ట్‌‌ టెన్‌‌లో ఇంగ్లండ్‌‌ 104/1తో నిలిచింది. 11వ ఓవర్‌‌ (నటరాజన్‌‌) ఫస్ట్‌‌ బాల్‌‌ను ఫోర్‌‌గా మలిచి 33 బాల్స్‌‌లో హాఫ్‌‌ సెంచరీ కంప్లీట్‌‌ చేసిన మలన్‌‌.. ఆ తర్వాత ఎక్స్‌‌ట్రా కవర్స్‌‌లో 6, 4తో రెచ్చిపోయాడు. ఈ ఓవర్‌‌లో 16 రన్స్‌‌ వచ్చాయి. ఇదే క్రమంలో బట్లర్‌‌ కూడా 30 బాల్స్‌‌లో ఫిఫ్టీ మార్క్‌‌ అందుకున్నాడు. ఈ ఇద్దరు క్రీజులో పాతుకుపోవడంతో భువీని మళ్లీ బౌలింగ్‌‌కు దించడం ఫలించింది. భువనేశ్వర్‌‌ వేసిన హార్డ్‌‌ లెంగ్త్‌‌ బాల్‌‌ను గాల్లోకి లేపిన బట్లర్‌‌.. లాంగాఫ్‌‌లో పాండ్యా చేతికి చిక్కాడు. దీంతో సెకండ్‌‌ వికెట్‌‌కు 82 బాల్స్‌‌లో 130 పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. మలన్‌‌తో కలిసిన బెయిర్‌‌స్టో (7) ఎక్కువసేపు వికెట్‌‌ కాపాడుకోలేకపోయాడు. 15వ ఓవర్‌‌లో శార్దూల్‌‌ డబుల్‌‌ షాకిచ్చాడు. మూడు బాల్స్‌‌ తేడాలో బెయిర్‌‌స్టో, మలన్‌‌ను ఔట్‌‌ చేసి మ్యాచ్‌‌ను ఇండియా వైపు తీసుకొచ్చాడు. 16వ ఓవర్‌‌లో పాండ్యా.. మోర్గాన్‌‌ (1)ను ఔట్‌‌ చేయడంతో  ఇంగ్లండ్‌‌ విక్టరీ ఈక్వేషన్‌‌ 24 బాల్స్‌‌లో 81 రన్స్‌‌గా మారింది. ఈ దశలో స్టోక్స్‌‌ (14) రెండు ఫోర్లు కొట్టి టచ్‌‌లోకి వచ్చినా.. హోమ్‌‌ టీమ్‌‌ బౌలర్లు లైన్‌‌ అండ్‌‌ లెంగ్త్‌‌తో కట్టడి చేశారు. 19వ ఓవర్‌‌ (నటరాజన్‌‌)లో మూడు బాల్స్‌‌ తేడాలో స్టోక్స్‌‌, ఆర్చర్‌‌ (1) ఔటయ్యారు. లాస్ట్‌‌ ఓవర్‌‌లో జోర్డాన్‌‌ (11) సిక్స్‌‌ కొట్టి వెనుదిరగగా, కరన్‌‌ (14 నాటౌట్‌‌) రెండు సిక్సర్లు కొట్టినా భారీ ఓటమిని తప్పించలేకపోయాడు.