సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా బ్యాటింగ్ లో చెలరేగి ఆడింది. బుధవారం (డిసెంబర్ 3) రాయ్‌పూర్ వేదికగా షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో తొలి వన్డేలాగే దూకుడుగా ఆడుతూ భారీ స్కోర్ చేసింది. విరాట్ కోహ్లీ (102) సిరీస్ లో వరుసగా రెండో సెంచరీ చేయడంతో పాటు యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ (105) కూడా శతకంతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో ఇండియా 5 వికెట్ల నష్టానికి 358 పరుగుల భారీ స్కోర్ చేసింది. 105 పరుగులతో గైక్వాడ్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్ రెండు వికెట్లు పడగొట్టాడు. బర్గర్, ఎంగిడి తలో వికెట్ తీసుకున్నారు.
ఈ సిరీస్ లో వరుసగా రెండోసారి టాస్ ఓడిన టీమిండియా మొదట బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. తొలి వికెట్ కు రోహిత్ శర్మ, జైశ్వాల్ 40 పరుగులు జోడించి పర్వాలేదనిపించారు. ఈ దశలో బర్గర్ వేసిన పోక అద్భుతమైన డెలివరీకి 14 పరుగులే చేసి రోహిత్ శర్మ పెవిలియన్ కు చేరాడు. వరుసగా మూడు వన్డేల్లో 50కి పైగా పరుగులు చేసిన తర్వాత హిట్ మ్యాన్ విఫలమయ్యాడు. బర్గర్ బౌలింగ్ లో వికెట్ కీపర్ డికాక్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కాసేపటికే ఇండియా జైశ్వాల్ రూపంలో రెండో వికెట్ కోల్పోయింది. వరుసగా రెండో మ్యాచ్ లోనూ నిరాశపరిచిన జైశ్వాల్ 22 పరుగులకే ఔటయ్యాడు.
ALSO READ : ద్రవిడ్‌ను వెనక్కి నెట్టిన రోహిత్ శర్మ..
62 పరుగులకే రెండు వికెట్లు పడిపోయిన భారత జట్టును గైక్వాడ్, కోహ్లీ ఆదుకున్నారు. సౌతాఫ్రికా బౌలర్లలను అలవోకగా ఆడుతూ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. క్రీజ్ లో కుదురుకున్నాక దూకుడుగా ఆడి భారీ స్కోర్ కు బాటలు వేశారు. ఈ క్రమంలో మొదట గైక్వాడ్ 77 బంతుల్లో తన సెంచరీ మార్క్ అందుకున్నాడు. కాసేపటికే కోహ్లీ కూడా 90 బంతుల్లో శతకం బాదాడు. మూడో వికెట్ కు గైక్వాడ్, కోహ్లీ కలిసి ఏకంగా 195 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. సెంచరీలు చేసిన వెంటనే వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. రాహుల్ తొలి వన్డే మాదిరిలా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతూ 43 బంతుల్లోనే 66 పరుగులు చేసి స్కోర్ ను 350 పరుగులు దాటించాడు.
1st ODI: 349, 2nd ODI: 358 💪 #INDvSA scorecard: https://t.co/IaMIjWzxBW pic.twitter.com/qI5Cr0XZ2E
— ESPNcricinfo (@ESPNcricinfo) December 3, 2025
