త్వరలో వాట్సాప్‌‌‌‌ ద్వారానే ఐపీపీబీ సర్వీస్‌‌‌‌లు

త్వరలో వాట్సాప్‌‌‌‌ ద్వారానే ఐపీపీబీ సర్వీస్‌‌‌‌లు

న్యూఢిల్లీ: త్వరలో వాట్సాప్‌‌‌‌ ద్వారానే ఇండియా పోస్ట్ పేమెంట్స్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌ (ఐపీపీబీ)  సర్వీస్‌‌‌‌లను పొందొచ్చు. ఈ మెసేజింగ్‌‌‌‌ యాప్‌‌‌‌తో భాగస్వామ్యం కోసం కేంద్రం ప్రయత్నాలు చేస్తోందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. కొత్త టెక్నాలజీలతో దేశంలోని పోస్టల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్‌‌‌‌ను మరింత సమర్ధవంతంగా మార్చాలని ప్రభుత్వం చూస్తోందని చెప్పారు. మొదట వాట్సాప్ ద్వారానే కస్టమర్లు ఐపీపీబీ అకౌంట్‌‌‌‌ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి, కొత్త అకౌంట్‌‌‌‌ను ఓపెన్ చేసుకోవడానికి  వీలుంటుంది.  కాగా,  పేమెంట్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌గా ఐపీపీబీని ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది ఇండియా పోస్ట్‌‌‌‌కు సబ్సిడరీ.  ‘బ్యాలెన్స్‌‌‌‌ చెక్ చేసుకోవడం, కొత్త అకౌంట్ కోసం రిక్వెస్ట్ పెట్టుకోవడం, పిన్‌‌‌‌ నెంబర్‌‌‌‌‌‌‌‌ను మార్చుకోవడం వంటి ఐపీపీబీ సర్వీస్‌‌‌‌లను పైలెట్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌గా వచ్చే 60 రోజుల్లో టెస్ట్‌‌‌‌ చేయనున్నారు’ అని ఈ విషయం తెలిసిన వ్యక్తులు పేర్కొన్నారు. నిర్ధిష్టమైన కస్టమర్లపై  వాట్సాప్ ద్వారా  క్యాష్ విత్‌‌‌‌డ్రా, డిపాజిట్‌‌‌‌ రిక్వెస్ట్‌‌‌‌లను పెట్టుకోవడం, ఆధార్‌‌‌‌‌‌‌‌ నుంచి ఆధార్ ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌, పాన్‌‌‌‌ నెంబర్‌‌‌‌, ఆధార్‌‌‌‌‌‌‌‌ నెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అప్‌‌‌‌డేట్ చేసుకోవడం వంటి సర్వీస్‌‌‌‌లను కూడా  టెస్ట్ చేయనున్నారు.