అమెరికా అమాంతం పెరిగిన బియ్యం ధరలు.. స్టోర్లలో నోస్టాక్ బోర్డులు..

అమెరికా అమాంతం పెరిగిన బియ్యం ధరలు..  స్టోర్లలో నోస్టాక్ బోర్డులు..

భారత్ ఎగుమతులపై నిషేధంతో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో బియ్యం ధరలు అమాంతం పెరిగిపోయాయి.  ముఖ్యంగా అమెరికాలో  రేట్లు భారీగా పెరిగాయి. డల్లాస్ లో సోనా మసూరి బియ్యానికి డిమాండ్  పెరిగింది. 10 కేజీల బియ్యానికి 20 పౌండ్లు ధర చెల్లిస్తున్నారు. బియ్యం కొరతతో ఒక కుటుంబానికి ఒక సంచి సోనా మసూరి బియ్యం మాత్రమే విక్రయిస్తున్నారు. 

జూలై 20 నుంచి ధరల పెరుగుదల కారణంగా బియ్యం ఎగుమతిని కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. బాస్మతి బియ్యం తప్పా మిగతా అన్ని రకాల బియ్యం ఎగుమతులను నిలిపివేసింది.  గత ఏడాది మొత్తం 22 మిలియన్ టన్నుల బియ్యం ఎగుమతుల్లో దాదాపు 10 మిలియన్ టన్నుల బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై పరిమితులు విధించింది. దేశీయ మార్కెట్ లో తెల్లబియ్యం తగినంత లభ్యత, ధరల స్థీరీకరణే లక్ష్యంగా భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. 

US వ్యవసాయ శాఖ ప్రకారం.. US వినియోగించే బియ్యంలో నాలుగింట ఒక వంతు కంటే ఎక్కువ భారతదేశం నుంచి దిగుమతి చేసుకుంటోంది.  భారత్ నుంచి యూఎస్ బాస్మతి రైస్ ను ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా బియ్యం వినియోగిస్తున్న ఆఫ్రికా, బంగ్లా దేశ్, పాకిస్తాన్ పెద్ద ఎత్తున ఆహార కొరత ఏర్పడే అవకాశం ఉంది. 

ప్రస్తుతం ప్రపంచంలోనే బియ్యం ఎగుమతుల్లో భారత్ అగ్రగామిగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా  బియ్యం ఎగుమతుల్లో 40 శాతానికి పైగా వాటా కలిగి ఉంది. చైనా తర్వాత రెండో పెద్ద బియ్యం ఉత్పత్తి దారుగా ఉంది.  ప్రపంచవ్యాప్తంగా మూడు బిలియన్ల మంది ప్రజలు వరిని ప్రధాన పంటగా తింటారు.. ప్రపంచవ్యాప్తంగా తినే బియ్యంలో 40% దేశం సరఫరా చేస్తుంది. ప్రస్తుతం ధరలు దశాబ్ద కాలంలో ఇదే అత్యధికం. అయితే 2023లో బియ్యం ఉత్పత్తి 20 ఏళ్లలో కనిష్ట స్థాయికి చేరుకోనుంది.