ఒకేసారి అత్యధిక ఉపగ్రహాలను పంపిన దేశాల్లో భారత్​ టాప్

ఒకేసారి అత్యధిక ఉపగ్రహాలను పంపిన దేశాల్లో భారత్​ టాప్

2017 , ఫిబ్రవరి 15న పీఎస్​ఎల్​వీ–సి37 ద్వారా రికార్డు స్థాయిలో 104 ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది. ఇప్పటివరకు ఏ దేశం కూడా ఇన్ని ఉపగ్రహాలను ఒకేసారి ప్రయోగించలేదు. ఒకేసారి అత్యధిక ఉపగ్రహాలను విజయవంతంగా పంపిన దేశాల్లో భారత్​ మొదటి స్థానంలో నిలిచింది.  ఆ తర్వాత రష్యా 37, అమెరికా 29 ఉపగ్రహాలను ఒకేసారి అంతరిక్షంలోకి పంపాయి.

భారత ఉపగ్రహాలు 

కార్టోశాట్​–2డి– బరువు 714 కిలోలు
ఐఎన్​ఎస్​–1ఎ– బరువు 8.4కిలోలు
ఐఎన్​ఎస్​–1బి– బరువు 9.7 కిలోలు
విదేశీ ఉపగ్రహాలు
అమెరికాకు చెందిన DOVE ఉపగ్రహాలు – 88,  LEMUR ఉపగ్రహాలు – 8
నెదర్లాండ్స్: PEASS, ఇజ్రాయెల్​: BGU Sat
కజకిస్తాన్: అల్​– ఫరాబి–1
యునైటెడ్​ అరబ్​ ఎమిరేట్స్​: నయీఫ్​–1 
స్విట్జర్లాండ్​: DIDO-2 
మొత్తం మీద 1380 కిలోల బరువు ఉన్న 104 ఉపగ్రహాలను పీఎస్​ఎల్​వీ–సి37 ప్రయోగించింది.