దేశవ్యాప్తంగా 24 గంటల్లో 14,516 కరోనా కేసులు

దేశవ్యాప్తంగా 24 గంటల్లో 14,516 కరోనా కేసులు

గత 24 గంటల్లో దేశంలో అత్యధికంగా 14,516 కరోనా కేసులు నమోదయ్యాయి. దాంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 3,95,048కు చేరింది. అదేవిధంగా 24 గంటల్లో 375 మంది కరోనాతో చనిపోయారు. దాంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 12,948కు పెరిగింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసులలో 1,68,269 కేసులు యాక్టివ్ గా ఉండగా.. 2,13,831 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

దేశంలోనే మహారాష్ట్ర అత్యధిక కేసులతో మొదటిస్థానంలో ఉంది. అక్కడ 1,24,331 కేసులు నమోదయ్యాయి. వాటిలో 55,665 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇప్పటివరకు మహారాష్ట్రలో 62,773 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. అదేవిధంగా అక్కడ మరణించిన వారి సంఖ్య 5,893గా నమోదయింది.

మహారాష్ట్ర తర్వాత తమిళనాడులో అధిక కేసులతో రెండో స్థానంలో ఉంది. అక్కడ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50 వేల మార్కును దాటి 54,449కు చేరుకుంది. ఆ తర్వాతి స్థానంలో దేశ రాజధాని మూడవ స్థానంలో ఉంది. అక్కడ కరోనా కేసుల సంఖ్య 53,116కు చేరుకుంది.

For More News..

మందు తాగి డ్యూటీ చేస్తున్న పోలీసులు

బ్రెజిల్‌లో మిలియన్ మార్కును దాటిన కరోనా కేసులు

వెంటిలేటర్ ప్లగ్ తీసి కూలర్ ప్లగ్ పెట్టిన కుటుంబసభ్యులు.. ఊపిరాడక..