326 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో గెలిచిన్రు.. యుగాండాను చిత్తు చేసిన ఇండియా

V6 Velugu Posted on Jan 24, 2022

తరౌబా (ట్రినిడాడ్‌‌‌‌‌‌‌‌):  అండర్‌‌‌‌‌‌‌‌–19 వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌లో యంగ్‌‌‌‌‌‌‌‌ ఇండియా రికార్డు విక్టరీ సొంతం చేసుకుంది.  రాజ్‌‌‌‌‌‌‌‌ బవా (162 నాటౌట్‌‌‌‌‌‌‌‌), రఘువన్షి (144) భారీ సెంచరీలకు తోడు  బౌలర్లు కూడా విజృంభించడంతో శనివారం అర్ధరాత్రి ముగిసిన గ్రూప్‌‌‌‌‌‌‌‌–బి లాస్ట్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఇండియా ఏకంగా 326 రన్స్‌‌‌‌‌‌‌‌ తేడాతో యుగాండాను చిత్తు చేసింది. వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌లో ఇదే లార్జెస్ట్‌‌‌‌‌‌‌‌ విక్టరీ కావడం విశేషం. టాస్‌‌‌‌‌‌‌‌ ఓడి ఫస్ట్‌‌‌‌‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ చేసిన ఇండియా 405/5 స్కోరు చేసింది. తర్వాత ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో ఉగాండా 19.4 ఓవర్లలో 79 రన్స్‌‌‌‌‌‌‌‌కే ఆలౌటై చిత్తుగా ఓడిపోయింది. కెప్టెన్‌‌‌‌‌‌‌‌ మురుంగి (34) టాప్‌‌‌‌‌‌‌‌ స్కోరర్‌‌‌‌‌‌‌‌. ఆ టీమ్‌‌‌‌‌‌‌‌లో ఆరుగురు డకౌటయ్యారు. స్టాండిన్‌‌‌‌‌‌‌‌ కెప్టెన్‌‌‌‌‌‌‌‌ నిషాంత్‌‌‌‌‌‌‌‌ సింధు (4/19)తో పాటు రాజ్‌‌‌‌‌‌‌‌వర్దన్‌‌‌‌‌‌‌‌ హంగర్గేకర్‌‌‌‌‌‌‌‌ (2/8) బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో సత్తా చాటారు. గ్రూప్‌‌‌‌‌‌‌‌–బిలో ఆడిన మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లోనూ గెలిచి ఇండియా గ్రూప్‌‌‌‌‌‌‌‌ టాపర్‌‌‌‌‌‌‌‌గా క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌ చేరుకుంది. కరోనా కారణంగా కెప్టెన్‌‌‌‌‌‌‌‌ యశ్‌‌‌‌‌‌‌‌ ధుల్‌‌‌‌‌‌‌‌ సహా ఆరుగురు ప్లేయర్లు అందుబాటులో లేకపోయినా.. గత రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో ఇండియా సూపర్‌‌‌‌‌‌‌‌ పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌ చేసింది. ఈనెల 29న జరిగే క్వార్టర్‌‌‌‌‌‌‌‌ఫైనల్లో బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌తో పోటీ పడనుంది.

Tagged India, VICTORY, record, , Under-19 World Cup

Latest Videos

Subscribe Now

More News