భారీగా పెరిగిన కరోనా కేసులు.. ఒక్కరోజే ఆరుగురు మృతి

భారీగా పెరిగిన కరోనా కేసులు.. ఒక్కరోజే ఆరుగురు మృతి

దేశంలో కరోనా కేసులపై మళ్లీ ఆందోళన మొదలైంది. మార్చి24న కొత్తగా 1,590 కేసులు నమోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య 8,601కి చేరుకుంది. గడిచిన  146 రోజుల్లో నమోదైన కేసుల్లో ఇవే అత్యధికమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గత రెండు రోజులుగా దేశంలో కరోనా కేసుల సంఖ్యలో పెరుగుదల మొదలైందని వెల్లడించింది. ఈ కేసులతో పాటు ఈ ఒక్క రోజే కరోనా వల్ల ఆరుగురు చనిపోయారని స్పష్టం చేసింది. వారిలో ముగ్గురు మహారాష్ట్రకు చెందిన వారు కాగా, కర్ణాటక, రాజస్థాన్, ఉత్తరాఖండ్ కు చెందిన వారు ఒక్కొకక్కరు చొప్పున ఉన్నారని తెలిపింది.

గడిచిన 24 గంటల్లో 910 మంది కోలుకోవడంతో ఈ వైరల్ ఇన్‌ఫెక్షన్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,41,62,832కి చేరుకుంది. రికవరీ రేటు 98.79 శాతంగా ఉంది. కేసు మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది. రోజువారీ పాజిటివిటీ రేటు, వీక్లీ పాజిటివిటీ రేటు వరుసగా 1.33 శాతం,1.23 శాతంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ కరోనా జాగ్రత్తలు విధిగా పాటించాలని కేంద్రం, అన్ని రాష్ట్రాలకు సూచిస్తోంది.