దేశంలో కొత్తగా 173 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 173 కరోనా కేసులు

దేశంలో కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. మాస్కులు ధరించి మాయదారి మహమ్మారిని అంతం చేయాలని సూచిస్తున్నారు. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 173 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇద్దరు కోవిడ్ బారిన పడి మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. 

ప్రస్తుతం దేశంలో 2,670 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకు 4.46 కోట్ల మందికి కరోనా సోకింది. మరణాల సంఖ్య 5,30,707కి చేరుకుంది. యాక్టివ్ కేసుల మొత్తం ఇన్ఫెక్షన్లలో కేవలం 0.01 శాతం ఉండగా.. రికవరీ రేటు 98.80 శాతంగా ఉంది. వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,41,45, 445కి పెరిగిందని, కేసు మరణాల రేటు 1.19 శాతంగా నమోదైందని ప్రభుత్వం వెల్లడించింది. దేశంలో ఇప్పటివరకు 220.10 కోట్ల డోస్‌ల కోవిడ్ వ్యాక్సిన్‌ను ప్రజలకు అందించారు. ప్రస్తుతం కర్ణాటకలో 326, కేరళలో 1,444, మహారాష్ట్రలో 161, ఒడిశాలో 88, రాజస్థాన్‌లో 79, తమిళనాడులో 86, ఉత్తరప్రదేశ్‌లో 49, పశ్చిమ బెంగాల్‌లో 55 యాక్టివ్ కేసులు ఉన్నాయి.