దేశంలో కొత్తగా10,093 కరోనా కేసులు

 దేశంలో కొత్తగా10,093 కరోనా కేసులు

వరుసగా గత నాలుగు రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పదివేలకు పైగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా10,093 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే కాస్త కేసులు తక్కువే. తాజా కేసులతో కలిపి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 57,542కు చేరుకుంది. మరోవైపు వైరస్ కు  మరో 19 మంది బలయ్యారు.  రికవరీ రేటు 98.68 శాతంగా, యాక్టివ్ కేసులు 0.13 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. 

 కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య తక్కువగా ఉంటుందని  తెలిపాయి.  మరో 10- నుంచి12 రోజుల వరకు కేసులు పెరిగే అవకాశం ఉందని, ఆ తర్వాత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని  ఇప్పటికే వెల్లడించాయి. కేసులు పెరిగిన ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.   కాగా జాతీయ టీకా డ్రైవ్ కింద ఇప్పటి వరకు 220.66 కోట్ల వ్యాక్సిన్ లను అందించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.