అజ్మీర్ దర్గా ఉత్సవాలు: పాక్ భక్తులకు వీసా నిరాకరించిన భారత్

అజ్మీర్ దర్గా ఉత్సవాలు: పాక్ భక్తులకు వీసా నిరాకరించిన భారత్

భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రం పరిధిలోని అజ్మీర్ దర్గాలో సూఫీ ఖాజా మొయినుద్దీన్ చిష్టీ ఉర్సు ఉత్సవాలు ఈ నెల 7వతేదీన జరగనున్నాయి. ప్రతీ ఏటా జరిగే ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు పాకిస్తాన్ నుంచి భారీ సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అయితే ఈ ఏడాది పాకిస్తానీను భారత్ అనుమతించేదు. వారికి వీసాలు ఇచ్చేందుకు నిరాకరించింది.

పుల్వామా ఉగ్ర దాడి తర్వాత భారత వాయుసేన ఉగ్ర శిబిరాలపై దాడులతో ఇండో -పాక్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇందులో భాగంగా భారత్ సందర్శనకు పాక్ భక్తులకు వీసాలు నిరాకరించిందని పాక్ మంత్రి సాహిబజ్దా నూర్ అల్ హఖ్ ఖాద్రి మంత్రి ఆరోపించారు.

గతేడాది 503 మంది పాక్ భక్తులకు అజ్మీర్ దర్గా సందర్శనకు భారత్ వీసాలు జారీ చేసింది. ఈ ఏడాది వీసాల కోసం 400 మంది పాక్ భక్తులు దరఖాస్తు చేసుకోగా, 190 మందికి భారత రాయబార కార్యాలయం వీసాలు జారీ చేసిందని సమాచారం. ప్రతి యేడు లాగే ఈ ఏడాది కూడా పాక్ భక్తులందరూ అజ్మీర్ దర్గాను సందర్శించుకునేలా వీసాలు జారీ చేయాలని పాక్ మంత్రి ఖాద్రి కోరారు.