రెన్యూవబుల్ ఎనర్జీలో ఇండియా జోరు.. గత పదేళ్లలో 3 రెట్లు పెరిగి 232 గిగావాట్లకు కెపాసిటీ

రెన్యూవబుల్ ఎనర్జీలో ఇండియా జోరు.. గత పదేళ్లలో 3 రెట్లు పెరిగి 232 గిగావాట్లకు కెపాసిటీ
  • 2030 నాటికి 500 గిగావాట్లు టార్గెట్‌

న్యూఢిల్లీ: గత పదేళ్లలో ఇండియాలో రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ మూడు రెట్లు పెరిగింది. 2014 మార్చిలో 75.52 గిగావాట్లు(జీడబ్ల్యూ) ఉన్న గ్రీన్ ఎనర్జీ కెపాసిటీ ఇప్పుడు 232 జీడబ్ల్యూకి చేరింది. ఇందులో పెద్ద హైడ్రో పవర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. గ్రిడ్-కనెక్టెడ్ సోలార్ పవర్ ప్లాంట్స్ వేసే రేటు కూడా 80 శాతం తగ్గింది. మెగావాట్‌కు సగటున రూ.10.95కి దిగొచ్చిందని  అధికార వర్గాలు పేర్కొన్నాయి.

2014లో సోలార్ ఎనర్జీ కెపాసిటీ 2.82 జీడబ్ల్యూ ఉండగా, ఇప్పుడు 108 జీడబ్ల్యూకి చేరింది.  విండ్ ఎనర్జీ కెపాసిటీ 21 జీడబ్ల్యూ నుంచి  51 జీడబ్ల్యూకి చేరుకుంది. సోలార్ మాడ్యుల్స్ ప్రొడక్షన్ 2014 తర్వాత నుంచే పుంజుకుంది. 2014లో కేవలం 2 జీడబ్ల్యూ సోలార్ మాడ్యూల్ ప్రొడక్షన్ ఉండేది. 2024 నాటికి భారత్ గ్లోబల్ లీడర్‌గా మారింది.

సోలార్ మాడ్యూల్ మాన్యుఫాక్చరింగ్ కెపాసిటీ 90 జీడబ్ల్యూకి చేరింది.  2030 నాటికి 150 జీడబ్ల్యూకి  చేరుతుందని అంచనా. 2014లో సోలార్ సెల్స్, వేఫర్స్ డొమెస్టిక్ ప్రొడక్షన్ దాదాపు జీరో.   ఇప్పుడు భారత్‌లో 25 జీడబ్ల్యూ సోలార్ సెల్ ప్రొడక్షన్, 2 జీడబ్ల్యూ వేఫర్ ప్రొడక్షన్‌ ఉంది. 2030 నాటికి  100 జీడబ్ల్యూ సోలార్ సెల్స్, 40 జీడబ్ల్యూ వేఫర్ కెపాసిటీ ఉంటుందని అంచనా.

బయోపవర్ జనరేషన్ కెపాసిటీ 8.1 జీడబ్ల్యూ నుంచి 11.5 జీడబ్ల్యూకి అంటే  42 శాతం పెరిగింది. కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) సెక్టార్ 2014లో ఒక్క ప్రాజెక్ట్‌తో 8 టన్నుల పర్ డే (టీపీడీ) నుంచి 2024లో 150 ప్రాజెక్ట్స్‌తో 1,211 టీపీడీకి విస్తరించింది.  2024లో భారత్ రికార్డ్ లెవెల్లో 25 జీడబ్ల్యూ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీని పెంచుకుంది.  2030 నాటికి 500 జీడబ్ల్యూ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ టార్గెట్.   భారత్ 2024లో విండ్, సోలార్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రిసిటీ ఉత్పత్తిలో  జర్మనీని అధిగమించి ప్రపంచంలో మూడో అతిపెద్ద ప్రొడ్యూసర్‌గా నిలిచింది.