దేశంలో లక్షన్నరకు దిగువకు కరోనా కేసులు

దేశంలో లక్షన్నరకు దిగువకు కరోనా కేసులు

దేశం కరోనా ఉదృతి కొనసాగుతోంది. రోజురోజుకు కేసులు తగ్గుతున్నా మరణాలు పెరగడం కలవర పెడుతోంది. గడిచిన 24 గంటల్లో 1,49,394 కేసులు నమోదవ్వగా 1072 మంది చనిపోయారు.2,46,674మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా దేశంలో 14,35,569 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. రోజు వారి పాజిటివిటి రేటు 9.27 శాతంగా ఉంది. భారత్ లో  నిన్నటి వరకు 168.47 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ జరిగింది.