2 నెలల తర్వాత.. కెనడియన్లకు భారత్ ఈ-వీసా సేవలు

2 నెలల తర్వాత.. కెనడియన్లకు భారత్ ఈ-వీసా సేవలు

రెండు దేశాల మధ్య కొనసాగుతున్న ప్రధాన దౌత్యపరమైన వివాదం క్రమంలో.. రెండు నెలల సుదీర్ఘ సస్పెన్షన్ తర్వాత కెనడియన్ల కోసం భారతదేశం ఈ-వీసా సేవలను తిరిగి ప్రారంభించింది. ఇది భారతదేశం, కెనడాల మధ్య దెబ్బతిన్న సంబంధాలను సరిదిద్దే దిశగా ముందుకు సాగుతోంది. కెనడా తమ గడ్డపై ఖలిస్తానీ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించి, మద్దతివ్వడంతో భారత్ ఇంతకుముందు వీసా సేవలను నిలిపివేసింది. కెనడాలో ఖలిస్తానీ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చిన తర్వాత ఈ గొడవ తీవ్రమైంది.

సెప్టెంబర్ 21నుంచి కెనడియన్లకు వీసా సర్వీసులను భారత్ నిలిపివేసింది. ఆ తర్వాత భద్రతాపరమైన పరిస్థితులను సమీక్షించిన భారత్.. అక్టోబర్ 26నుంచి కెనడా పౌరులకు ఎంట్రీ వీసా, బిజినెస్ వీసా, మెడికల్, కాన్ఫరెన్స్ వీసా వంటి సేవలను పునరుద్ధరించింది. తాజాగా ఈ - వీసా సేవలను కూడా అందుబాటులోకి తెచ్చినట్టు భారత్ వెల్లడించింది. దీంతో కెనడా పౌరులకు అన్ని రకాల వీసా సర్వీసులు పునరుద్ధరించబడ్డాయి.