
ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టీ20లో భారత్ 208 రన్స్ చేసింది. హర్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో ఆసీస్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. చివరి ఓవర్ లో పాండ్యా వరుసగా 3 సిక్సులు కొట్టడంతో ఈ ఓవర్ లో మొత్తం 21 రన్స్ వచ్చాయి. కేఎల్ రాహుల్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన పాండ్యా స్టార్టింగ్ నుంచే దూకుడుగా ఆడాడు. మొత్తం 30 బాల్స్ ఆడిన అతడు 7 ఫోర్స్, 5 సిక్సులతో 71 రన్స్ చేశాడు.
ఓపెనర్ గా వచ్చిన రాహుల్ దూకుడుగా ఆడాడు. 35 బాల్స్ లో 3 సిక్సులు, 4 ఫోర్లతో 55 రన్స్ చేశాడు. 103 రన్స్ వద్ద హేజిల్వుడ్ బౌలింగ్ లో రాహుల్ భారీ షాట్ కు ప్రయత్నించి ఔటయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ 46 రన్స్తో రాణించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 11 రన్స్ చేయగా.. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ మళ్లీ విఫలమయ్యాడు. 2 రన్స్ చేసి నాథన్ ఎల్లిస్ బౌలింగ్ లో ఔటయ్యాడు. అంతకుముందు టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆ మ్యాచ్ కు రిషబ్ పంత్, బుమ్రా దూరమయ్యారు.