నాగపూర్: బంగ్లాదేశ్ హిందువులు అకారణంగా హింసకు గురవుతున్నారని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఇండియా వారికి సాయం చేయాలని కోరారు. గురువారం నాగపూర్ లోని ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ లో జెండా ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘‘మన పొరుగు దేశంలో హింస కొనసాగుతోంది. అక్కడి హిందువులు అకారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మన దేశం సురక్షితంగా ఉండేలా చూసుకుంటునే పొరుగు దేశాలకు సహాయం చేయాలి. ” అని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
