మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లు

మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లు

డిసెంబర్ 10  నుంచి  సౌతాఫ్రికాతో భారత్  మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. అయితే  మూడు  ఫార్మాట్లకు ముగ్గురు  కెప్టెన్లను ప్రకటించింది  బీసీసీఐ.  వన్డేలు, టీ20ల నుంచి  రోహిత్, కోహ్లీకి విశ్రాంతినిచ్చింది. టీ20లకు  సూర్యకుమార్ యాదవ్ ... వన్డేలకు కేఎల్  రాహుల్, టెస్టులకు రోహిత్ శర్మను కెప్టెన్లుగా నియమించింది. 

అయితే రోహిత్, కోహ్లీలను వన్డేలు, టీ20లకు ఎంపిక చేయకపోవడంపై బీసీసీఐ ట్విట్టర్లో క్లారిటీ ఇచ్చింది. తమకు  రెస్ట్ కావాలని రోహిత్, కోహ్లీ అడిగినందునే  ఎంపిక చేయలేదని  వివరణ ఇచ్చింది.

మూడు వన్డేలకు భారత జట్టు: 

రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రజత్ పాటిదార్, రింకూ సింగ్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కెప్టెన్ ), సంజు శాంసన్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ , ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్, అర్ష్దీప్ సింగ్, దీపక్ చాహర్.

3 టీ20ల కోసం భారత జట్టు

యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకు సింగ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), జితేష్ శర్మ (వికెట్ కీపర్ ), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ , రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, మొహమ్మద్. సిరాజ్, ముఖేష్ కుమార్, దీపక్ చాహర్.

రెండు టెస్టులకు భారత జట్టు

 రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్ ), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మొహమ్మద్. సిరాజ్, ముఖేష్ కుమార్, మొహమ్మద్. షమీ, జస్ప్రీత్ బుమ్రా (VC), ప్రసిద్ధ్ కృష్ణ.