ఆసియా ఎలైట్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్లో శివ థాపాకు సిల్వర్

ఆసియా ఎలైట్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్లో శివ థాపాకు సిల్వర్


ఆసియా ఎలైట్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్లో ఇండియా స్టార్ బాక్సర్ శివ థాపా సిల్వర్తో సరిపెట్టుకున్నాడు. 63.5 కేజీల విభాగంలో ఉజ్బెకిస్తాన్ బాక్సర్ అబ్దుల్లావ్ రుస్లాన్తో జరిగిన ఫైనల్లో శివ థాపా గాయం కారణంగా తప్పుకున్నాడు. దీంతో రజతాన్ని సాధించాడు. 

గాయం కారణంగా రద్దు
ఆట ప్రారంభమైన తొలి మూడు నిమిషాల్లో తొలి రౌండ్లో ఇద్దరు బాక్సర్లు హోరా హోరీగా తలపడ్డారు. ఒకరిపై ఒకరు పంచ్లతో విరచుకుపడ్డారు. అయితే రెండో రౌండ్లో రెచ్చిపోయిన ఉజ్బెకిస్తాన్ బాక్సర్ పంచ్లకు థాపా కాన్వాస్పై పడిపోయాడు. ఈ సమయంలో తనంతట తానే లేచాడు. అయితే అతని కుడి మోకాలికి గాయం కావడంతో..నొప్పిని తట్టుకోలేకపోయాడు. ఈ సమయంలో థాపా చికిత్స చేసుకున్నా...ఫలితం లేకుండా పోయింది. దీంతో రిఫరీ బౌట్ను రద్దు చేసి..అబ్దుల్లావ్ రుస్లాన్ ను విజేతగా ప్రకటించారు. ఈ సమయంలో స్కోరు 5-0గా ఉంది. 

విజయవంతమైన బాక్సర్
ఈ టోర్నీ చరిత్రలో శివథాపాకు ఇది మూడో సిల్వర్ మెడల్. ఓవరాల్గా ఆరో మెడల్ కావడం విశేషం. అతను 2017, 2021లోనూ రజత పతకాలను సొంతం చేసుకున్నాడు. 2013లో గోల్డ్ మెడల్ సాధించగా..2015, 2019లో కాంస్య పతకాలను దక్కించుకున్నాడు.  మొత్తంగా ఆసియా ఎలైట్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో అత్యంత విజయవంతమైన బాక్సర్గా శివ థాపా రికార్డు సృష్టించాడు. 

అంతకుముందు సెమీస్ లో తజకిస్తాన్ బాక్సర్ బకోదుర్ ఉస్మానోవ్ పై శివ థాపా గెలిచి ఫైనల్లోకి దూసుకొచ్చాడు. 63.5 కేజీల విభాగంలో సెమీస్ లో శివ 4-1 తేడాతో నెగ్గాడు. మరోవైపు గాయం వల్ల సెమీస్ బౌట్ లో 57 కేజీల విభాగంలో తెలంగాణ స్టార్ బాక్సర్ మహ్మద్ హుస్సాముద్దీన్ బ్రౌంజ్ తో సరిపెట్టుకున్నాడు.