మరో క్షిపణి ప్రయోగం విజయవంతం

మరో క్షిపణి ప్రయోగం విజయవంతం

భూ ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే మీడియం రేంజ్ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని బాలాసోర్ తీరంలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఆర్మీకి చెందిన ఈ మిస్సైల్ ప్రయోగం జరిగింది. క్షిపణి లక్ష్యాన్ని ధ్వసం చేసిందని డీఆర్డీఓ అధికారులు తెలిపారు. ఉదయం 10.30గంటలకు నిర్వహించిన పరీక్షలో దీర్ఘ శ్రేణి ఏరియల్ లక్ష్యాన్ని ఢీకొట్టి ధ్వంసం చేసిందని వెల్లడించారు. 

భారత్‌ ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే బ్రహ్మోస్ సూపర్‌ సోనిక్‌ క్రూయిజ్ మిస్సైల్ ను బుధవారం విజయవంతంగా పరీక్షించింది. తాజాగా ఉపరితలం నుంచి గగనతల లక్ష్యాలను ఛేదించే మీడియం రేంజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు. వీటితో పాటు సుదూర లక్ష్యాలను ఛేదించే దీర్ఘ శ్రేణి బ్రహ్మోస్‌ వెర్షన్‌ను భారత నేవీ ఈ నెలలో పరీక్షించింది. 

For more news..

ఆర్టీసీ చార్జీలు రూ. 5 నుంచి 14 వరకు పెరిగే చాన్స్

ఆగని పెట్రో ధరలు.. ఆరు రోజుల్లో 5 సార్లు పెంపు