ఆఫ్ఘనిస్తాన్‌కు మరోసారి చేయూతనిచ్చిన భారత్

ఆఫ్ఘనిస్తాన్‌కు మరోసారి చేయూతనిచ్చిన భారత్

తాలిబాన్ల ఆక్రమణలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌కు భారత్ మరోసారి ఆపన్నహస్తం అందించింది. ఓవైపు తాలిబాన్ల వికృతచేష్టలు, మరోవైపు కరోనా విలయతాండవంతో అల్లాడుతున్న ఆ దేశానికి.. భారత్ తాజాగా 5 లక్షల కోవాక్సిన్ డోసులను సరఫరా చేసింది. గతంలో కూడా వ్యాక్సిన్ డోసులను అందచేసిన ఇండియా.. మరోసారి వ్యాక్సిన్లు అందించి ఆఫ్ఘన్ కు అండగా నిలిచింది. వ్యాక్సిన్ డోసులను కాబూల్‌లోని ఇందిరా గాంధీ ఆసుపత్రికి అందజేసినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. అంతేకాకుండా.. మరో 5,00,000 డోసుల అదనపు వ్యాక్సిన్‌ను రాబోయే వారాల్లో ఆఫ్ఘనిస్తాన్‌కు సరఫరా చేయనున్నట్లు తెలిపింది. 

కేవలం వ్యాక్సిన్ డోసులను మాత్రమే కాకుండా.. ఆఫ్ఘన్ ప్రజలకు ఆహార ధాన్యాలు మరియు అవసరమైన ప్రాణాలను రక్షించే మందులను కూడిన అందించడానికి భారతదేశం కట్టుబడి ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ‘గత నెలలో 1.6 టన్నుల మెడికల్ ఎక్విప్ మెంట్ పంపించాం. రాబోయే వారాల్లో గోధుమల సరఫరా మరియు మిగిలిన వైద్య సహాయాన్ని చేపట్టనున్నాం. ఈ విషయంలో రవాణాకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయడానికి ఐక్యరాజ్యసమితితో సంప్రదింపులు జరుపుతున్నాం’ అని తెలిపింది.

For More News..