
ముంబై: మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, జాతిపిత మహాత్మా గాంధీ కుటుంబ పాలన వల్లే ఇండియా మనుగడ సాగించగలుగుతోందని మహారాష్ట్రలోని అధికార పార్టీ శివసేన వ్యాఖ్యానించింది. మనకు పొరుగున ఉన్న చిన్న దేశాలు వ్యాక్సిన్ కావాలంటూ భారత్‌ను కోరుతున్నాయని.. కానీ కేంద్రం మాత్రం కోట్లాది రూపాయలతో సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌ను నిర్మించడంలో తలమునకలైందని శివసేన మండిపడింది. ‘సుస్పష్టంగా చెప్పాలంటే.. నెహ్రూ-గాంధీ ఫ్యామిలీ సృష్టించిన వ్యవస్థ మీదే భారత్ మనుగడ సాగిస్తోంది. చాలా దేశాలు ఇండియా సాయం కోసం ఎదురు చూస్తున్నాయి. పాకిస్థాన్, రువాండా, కాంగో లాంటి దేశాలు మిగతా కంట్రీల నుంచి సాయాన్ని అందుకున్నాయి. నేటి మన పాలకులు సరైన విధానాలు పాటించకపోవడం వల్ల భారత్ పరిస్థితి ఇలా తయారయ్యింది’ అని శివసేన సామ్నా రాసుకొచ్చింది. కరోనా మహమ్మారిపై పోరాటం గురించి చర్చించడానికి అన్ని ప్రధాన పార్టీలతో కలసి జాతీయ ప్యానెల్‌ను ఏర్పాటు చేయాలని శివసేన డిమాండ్ చేసింది.