ఇండియన్ వేరియంట్ అని పిలవొద్దు

ఇండియన్ వేరియంట్ అని పిలవొద్దు

భారత్ లో మార్పులు చెందుతున్న కరోనా వైరస్ ను ఇండియన్ వేరియంట్ గా పిలువొద్దని సోషల్ మీడియా కంపెనీలకు కేంద్రం సూచించింది. ఈ పేరుతో ఉన్న కంటెంట్ ను తొలగించాలని ఆదేశించింది. కరోనాపై తప్పుడు ప్రచారం వ్యాప్తి చెందకూడదన్న ఉద్దేశంతో సోషల్ మీడియా కంపెనీలకు కేంద్ర ఐటీ శాఖ లేఖలు రాసింది. భారత్ లో మార్పులు చెందుతున్న వైరస్ ను B.1.617 గుర్తించారని, ప్రపంచ ఆరోగ్య  సంస్థ భారత వేరియంట్ గా పేరు పెట్టలేదని స్పష్టం చేసింది. అనవసరంగా ఇండియన్ వేరియంట్ అని పిలవడంతో దేశ ప్రతిష్ట దిగజారుతోందన్నారు అధికారులు.