
న్యూఢిల్లీ: స్విస్ బ్యాంకుల్లో డబ్బులు దాచుకున్న భారతీయ కుబేరుల వివరాలు ఆదివారం బయటపడనున్నాయి. తమ ఖాతాదారుల వివరాలను స్విస్బ్యాంకులు ఇప్పటి వరకూ అత్యంత గోప్యంగా ఉంచాయి. ఇండియన్గవర్నమెంట్కోరినా బయటపెట్టలేదు.. తాజాగా సమాచార మార్పిడికి సంబంధించి ఇండియా, స్విట్జర్లాండ్మధ్య ఒప్పందం కుదిరింది. ఆదివారం నుంచి అమలులోకి రానున్న ఈ ఒప్పందంతో నల్ల కుబేరుల వివరాలన్నీ వెలుగులోకి వస్తాయని సీబీడీటీ అధికారులు చెబుతున్నారు. నల్లధనంపై కేంద్రం జరుపుతున్న పోరులో ఇదో కీలకమైన అడుగని చెప్పారు. 2018 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లావాదేవీల వివరాలను అందుకోనున్నామని, ఆ ఏడాదిలో ఖాతాలు మూసేసిన వారి వివరాలు కూడా అందులో ఉంటాయని వివరించారు.