స్పేస్​లోకి ఫీమేల్ రోబో ‘వ్యోమమిత్ర’ను పంపిస్తం

స్పేస్​లోకి ఫీమేల్ రోబో  ‘వ్యోమమిత్ర’ను పంపిస్తం

న్యూఢిల్లీ: భారతీయ వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లే గగన్ యాన్  మిషన్ లో ఫీమేల్  రోబో ‘వ్యోమ మిత్ర’ ను పంపుతామని కేంద్ర సైన్స్ అండ్  టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్  తెలిపారు. ఇందు కోసం అక్టోబర్  మొదటి లేదా రెండో వారంలో ట్రయల్  స్పేస్ ఫ్లైట్ ను ప్రయోగించి చూస్తామని ఆయన చెప్పారు.

 శనివారం నిర్వహించిన ఎన్డీటీవీ జీ20 కాన్ క్లేవ్ లో మంత్రి మాట్లాడారు. ‘‘కరోనా మహమ్మారి వల్ల గగన్ యాన్  ప్రాజెక్టు ఆలస్యమైంది. అక్టోబర్  ఫస్ట్  లేదా సెకండ్  వీక్ లో మొదటి ట్రయల్  నిర్వహిస్తం. వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపడం ఎంత ముఖ్యమో తిరిగి తీసుకురావడం కూడా అంతే ముఖ్యం. సెకండ్  మిషన్​లో ఫీమేల్  రోబోను పంపుతం. మనుషులు చేసే అన్ని పనులను ఆ రోబో చేస్తుంది” అని మంత్రి పేర్కొన్నారు.