బ్రిటన్‎తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చారిత్రాత్మక మైలురాయి: ప్రధాని మోడీ

బ్రిటన్‎తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చారిత్రాత్మక మైలురాయి: ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: భారత్-బ్రిటన్ మధ్య చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఇరు దేశాలు ఎంతో కాలంగా ఎదురుచూస్తోన్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఎట్టకేలకు కుదిరింది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ఇరుదేశాలు సంతకం చేశాయి. ఈ విషయాన్ని ప్రధాని మోడీ స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియా ఫ్లాట్‎ఫామ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేసిన మోడీ..  భారత్-బ్రిటన్ మధ్య చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం కుదరడంపై హర్షం వ్యక్తం చేశారు.

‘‘భారత్-బ్రిటన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం విజయవంతంగా కుదిరింది. ఈ అగ్రిమెంట్ రెండు దేశాలకు లాభాదాయకం. బ్రిటన్‎తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చారిత్రాత్మక మైలురాయి. ఇది మా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుతుంది. రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడి, వృద్ధి, ఉద్యోగ సృష్టి, ఆవిష్కరణలను ఉత్ప్రేరకపరుస్తుంది’’ అని ప్రధాని మోడీ పేర్కొన్నారు.