ఇండియా అండర్‌‌‌‌‌‌‌‌–19.. ఇంగ్లండ్తో చివరి వన్డేలో కుర్రాళ్ల ఓటమి

ఇండియా అండర్‌‌‌‌‌‌‌‌–19..  ఇంగ్లండ్తో చివరి వన్డేలో కుర్రాళ్ల ఓటమి

వార్సెస్టస్‌‌‌‌: ఇంగ్లండ్‌‌‌‌ అండర్‌‌‌‌‌‌‌‌–19 టీమ్‌‌‌‌తో వన్డే సిరీస్‌‌‌‌ను ఇండియా కుర్రాళ్లు ఓటమితో ముగించారు. ఇప్పటికే సిరీస్ నెగ్గిన యంగ్ ఇండియా.. సోమవారం జరిగిన చివరి, ఐదో వన్డేలో 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. తొలుత ఇండియా 50 ఓవర్లలో 210/9 స్కోరు మాత్రమే చేసింది. ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ అంబరిష్‌‌‌‌ (66 నాటౌట్‌‌‌‌) టాప్ స్కోరర్‌‌‌‌‌‌‌‌. 

కెప్టెన్ ఆయుష్ మాత్రే (1), విహాన్ మల్హోత్రా (1) ఫెయిలవగా.. గత మ్యాచ్ సెంచరీ హీరో వైభవ్ సూర్యవంశీ (33) ఫర్వాలేదనిపించాడు.అనంతరం ఛేజింగ్‌‌‌‌లో ఇంగ్లండ్ కుర్రాళ్లు 31.1 ఓవర్లలోనే 211/3 స్కోరు చేసి గెలిచారు. బెన్‌‌‌‌ మయెస్ (82), డాకిన్స్ (66), కెప్టెన్ థామస్ రివ్ (49 నాటౌట్‌‌‌‌) సత్తా చాటారు. 

నమన్ పుష్పక్‌‌‌‌ రెండు, దీపేశ్‌‌‌‌ ఒక వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌‌‌‌లో ఓడినా సిరీస్‌‌‌‌ను ఇండియా 3–2తో సొంతం చేసుకుంది. ఇరు జట్ల మధ్య రెండు యూత్ టెస్టుల సిరీస్‌‌‌‌లో భాగంగా ఈ నెల 12న బెకెన్‌‌‌‌హామ్‌‌‌‌లో తొలి మ్యాచ్‌‌‌‌ మొదలవుతుంది.