ఇండో–అమెరికా బంధాల బలోపేతానికి ఆరు దశాబ్దాలు పట్టింది

ఇండో–అమెరికా బంధాల బలోపేతానికి ఆరు దశాబ్దాలు పట్టింది

న్యూఢిల్లీ: ఇండియా–అమెరికాల మధ్య సంబంధాలు సరైన రూపును సంతరించుకోవడానికి ఆరు దశాబ్దాల టైమ్ పట్టిందని విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్ తెలిపారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు వేగంగా బలపడటం గురించి ఆయన పలు విషయాలు పంచుకున్నారు. వేరే కంట్రీస్‌తో పోలిస్తే ఇండో–అమెరికాలు ఒకరినొకరు అనుభూతి చెందినట్లుగా మరే దేశాలూ చేయవన్నారు. సింగపూర్‌‌తో కూడా ఇండియాకు ప్రత్యేక సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు.

‘యూఎస్‌కు డొనాల్డ్‌ ట్రంప్, బరాక్ ఒబామా. జార్జ్ డబ్ల్యూ బుష్, బిల్‌ క్లింటన్ చివరి నలుగురు ప్రెసిడెంట్‌లు. ప్రపంచంలో ఒకరితో మరొకరు తక్కువ సారూప్యతలు కలిగిన నలుగురిని మీరు కనుగొనలేరు. అయినా వారందరూ ఇండియాతో సంబంధాలను పట్టిష్టం చేసుకోవడానికి మాత్రం సమ ప్రాధాన్యత ఇచ్చారు. ఈ బంధం బలపడటానికి ఆరు దశాబ్దాలు పట్టింది. మా సంబంధాల్లో యూఎస్‌తో రిలేషన్‌షిప్ చాలా కీలకమైనది. విలువలకు చాలా ప్రాధాన్యం ఉంటుందని నా నమ్మకం. ఇండో–అమెరికాలు ఒకరి సమాజాన్ని మరొకరు చాలా బాగా అర్థం చేసుకున్నాయి. ఈ రెండు దేశాలూ ఒకరికొకరు అనుభూతి చెందినట్లుగా చాలా దేశాలు చేయవు. ఇది కేవలం పరిపాలనకు మాత్రమే సంబంధించినది కాదు. ఆ దేశ రాజకీయాల్లో ముఖ్యంగా అమెరికన్ కాంగ్రెస్‌లో మేం బలమైన సత్సంబంధాలు కలిగి ఉన్నాం’ అని జైశంకర్ చెప్పారు.