IND vs AUS: మొదటి టీ20కు భారీ వర్ష సూచన.. మ్యాచ్ జరుగుతుందా..?

IND vs AUS: మొదటి టీ20కు భారీ వర్ష సూచన.. మ్యాచ్ జరుగుతుందా..?

వరల్డ్ కప్ తర్వాత టీమిండియా కొత్త సిరీస్ కు సిద్ధమైంది. స్వదేశంలో ఆస్ట్రేలియాతో 5 టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా నేడు(నవంబరు 23) తొలి టీ20 ఆడనుంది. వైజాగ్ వేదికగా ఈ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ ఉండడంతో ఈ సిరీస్ ను ఇరు జట్లు సీరియస్ గా తీసుకుంటున్నాయి. అంతా బాగానే ఉన్నా నేడు జరిగే టీ20 మ్యాచ్ కు వర్షం పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. 
      
 AccuWeather ప్రకారం, విశాఖపట్నంలో దాదాపు 28 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. తేమ సుమారుగా 63 శాతానికి చేరుకుంటుంది. నగరంలో నేడు 60 శాతం వర్షం కురిసే అవకాశం ఉంది. మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. కానీ అదృష్టవశాత్తూ సాయంత్రానికి వర్ష సూచనలు లేకపోవడం గమనార్హం. సాయంత్రం జల్లులు పడే అవకాశం చాలా తక్కువగా ఉందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. 

ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే  సూర్య కుమార్ యాదవ్ సారధ్యంలో భారత్ యంగ్ జట్టుతో ఈ మ్యాచ్ లో బరిలోకి దిగుతుంది. మరో వైపు ఆస్ట్రేలియా సీనియర్లు, జూనియర్లతో పటిష్టంగా కనిపిస్తుంది. మంచు ప్రభావం ఉండడంతో ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ తీసుకునే అవకాశం ఉంది. వరల్డ్ కప్ తర్వాత తొలి సిరీస్ ఆడుతున్న ఇరు జట్లు  మొదటి టీ 20 మ్యాచ్ లో ఎవరు బోణీ కొడతారో చూడాలి.  

Also Read :- వాట్సాప్‌ ఛానెల్‌లోకి రాహుల్.. ఒక్కరోజే 42 లక్షల మంది ఫాలోవర్లు