
అహ్మదాబాద్ లో ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న నాలుగో టెస్టు మూడో రోజు ఆట జరుగుతోంది. యువ బ్యాటర్ శుభ్ మన్ గిల్ సెంచరీ చేశారు. 194 బంతుల్లో గిల్ సెంచరీ బాదాడు. అతడికి ఇది రెండో సెంచరీ.
గిల్ సెంచరీ చేసిన వెంటనే భారత్ రెండో వికెట్ కోల్పోయింది . ఛటేశ్వర పుజారా 42 పరుగుల వద్ద ఔటయ్యాడు. ప్రస్తుతానికి భారత్ రెండు వికెట్లో కోల్పోయి 187 పరుగులు చేసింది. క్రీజులో శుభ్ మన్ గిల్ 103, విరాట్ కోహ్లీ క్రీజులో ఉన్నారు. భారత్ ఇంకా 292 పరుగుల వెనుకంజలో ఉంది.
అంతకు ముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 480 పరుగులు చేసింది. ఖవాజా 180, గ్రీన్ 114 పరుగులు చేశారు. భారత బౌలర్లలో అశ్విన్ 6, షమీ 2, జడేజా, అక్షర్ పటేలో ఒక్కో వికెట్ తీశారు.