2 - 1తో వన్డే సిరీస్​ నెగ్గిన ఇండియా

V6 Velugu Posted on Mar 29, 2021

  • చివరి మ్యాచ్​లో థ్రిల్లింగ్​ విక్టరీ
  • పంత్‌, హార్దిక్​, ధవన్‌ మెరుపులు  
  • భువీ, ఠాకూర్‌ సూపర్‌ బౌలింగ్‌
  • కరన్‌ హిట్టింగ్‌ వృథా
  • గత 15 ఏళ్లలో ఇండియాలో ఆడిన 6 వన్డే సిరీసుల్లోనూ ఓడిన ఇంగ్లండ్

లాస్ట్‌ బాల్‌ వరకు ఉత్కంఠ రేపిన ఆఖరి వన్డేలో ఇండియా అద్భుతం చేసింది..! కీలక టైమ్‌లో మూడు క్యాచ్‌లు మిస్‌ అయినా..చివర్లో  నటరాజన్‌, సూపర్‌ బౌలింగ్‌తో చెలరేగి.. దంచికొడుతున్న సామ్‌ కరన్‌ (83 బాల్స్‌లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 95 నాటౌట్‌)కు అడ్డుకట్ట వేశాడు..! ఫలితంగా స్వల్ప తేడాతో నెగ్గిన ఇండియా 2–1తో వన్డే సిరీస్‌నూ సొంతం చేసుకుంది..! ఓవరాల్‌గా కరోనా తర్వాత హోమ్​గ్రౌండ్​లో ఆడిన పూర్తిస్థాయి ఇంటర్నేషనల్‌ ఈవెంట్‌లో టీమిండియా మెరిసిపోయింది..! వరుసగా మూడు సిరీస్‌లు నెగ్గి.. ఇంగ్లండ్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది..!!

ప్రతి ఫార్మాట్ లోనూ తిరుగులేని పెర్ఫామెన్స్ తో అదరగొట్టిన టీమిండియా ఇంగ్లండ్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. లాస్ట్ బాల్ వరకు థ్రిల్లర్ లా సాగిన చివరి వన్డేలోనూ 7 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించి సిరీస్ ను 2 - 1 తేడాతో సొంతం చేసుకుంది. అంతకుముందు జరిగిన టెస్టు, టీ20 సిరీస్ లను టీమిండియా గెల్చుకుంది. 

పుణె: ఓవైపు బ్యాట్స్‌‌మెన్‌‌.. మరోవైపు బౌలర్లు సమయోచితంగా రాణించడంతో.. థర్డ్‌‌ వన్డేలో టీమిండియా గ్రాండ్‌‌ విక్టరీ కొట్టింది. దీంతో ఆదివారం ముగిసిన మ్యాచ్‌‌లో ఇండియా 7 రన్స్‌‌ తేడాతో ఇంగ్లండ్‌‌పై గెలిచింది. రిషబ్‌‌ పంత్‌‌ (62 బాల్స్‌‌లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 78), శిఖర్‌‌ ధవన్‌‌ (56 బాల్స్‌‌లో 10 ఫోర్లతో 67), హార్దిక్‌‌ పాండ్యా (44 బాల్స్‌‌లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 64) చెలరేగడంతో.. ముందుగా బ్యాటింగ్‌‌ చేసిన ఇండియా 48.2 ఓవర్లలో 329 రన్స్‌‌ చేసింది. తర్వాత ఇంగ్లండ్‌‌ 50 ఓవర్లలో 9 వికెట్లకు 322 రన్స్‌‌కే పరిమితమైంది. కరన్‌‌తో పాటు మలన్‌‌ (50) అదరగొట్టినా.. శార్దూల్‌‌ ఠాకూర్‌‌ (4/67), భువనేశ్వర్‌‌ (3/42) సూపర్‌‌ బౌలింగ్‌‌తో కట్టడి చేశారు. కరన్‌‌కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’, బెయిర్‌‌స్టోకు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద సిరీస్‌‌’ అవార్డులు లభించాయి. 
పంత్‌‌, పాండ్యా జోరు..
టాస్‌‌ ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన ఇండియా ఇన్నింగ్స్‌‌లో ముగ్గురు ప్లేయర్లు హాఫ్‌‌ సెంచరీలతో మెరిసినా.. లోయర్‌‌ ఆర్డర్‌‌ వైఫల్యం వల్ల భారీ స్కోరుకు కళ్లెం పడింది. ఓపెనర్లు రోహిత్‌‌ (37), ధవన్‌‌ నిలకడగా ఆడి ఫస్ట్‌‌ వికెట్‌‌కు 103 రన్స్‌‌ జోడించారు. అయితే ఛేంజ్‌‌ బౌలర్‌‌గా వచ్చిన రషీద్‌‌ తన వరుస ఓవర్లలో రెండు గూగ్లీలతో ఈ ఇద్దర్ని ఔట్‌‌ చేశాడు. ఫామ్​లో ఉన్న కెప్టెన్‌‌ కోహ్లీ (7) ఈ సారి ఫెయిలయ్యాడు. అలీ (1/39) వేసిన టర్నింగ్‌‌ బాల్‌‌ను కట్‌‌ షాట్‌‌ఆడటానికి ట్రై చేసి క్లీన్‌‌బౌల్డ్‌‌ అయ్యాడు. కాసేపటికే లివింగ్‌‌స్టోన్‌‌ వేసిన ఫుల్‌‌టాస్‌‌ను బ్లండర్‌‌గా ఆడి రాహుల్‌‌ (7) స్క్వేర్‌‌ లెగ్‌‌లో అలీ చేతికి చిక్కాడు. సగం ఇన్నింగ్స్‌‌ ముగిసే వరకు ఇండియా 25 ఓవర్లలో 157/4తో నిలిచింది. ఇక్కడి నుంచి రిషబ్​ పంత్‌‌, హార్దిక్‌‌ ఫుల్‌‌ జోష్‌‌ చూపెట్టారు. స్పిన్నర్లను టార్గెట్‌‌గా చేసుకుని భారీ సిక్సర్లతో రెచ్చిపోయారు. ఫలితంగా 30 ఓవర్లలో ఇండియా స్కోరు 200లకు చేరింది. స్పిన్నర్లు ఎక్కువ రన్స్‌‌ ఇస్తున్నారని పేసర్లు వచ్చినా పరిస్థితిలో మార్పు రాలేదు.  పంత్‌‌ మరో భారీ సిక్సర్‌‌ కొట్టి 44 బాల్స్‌‌లో థర్డ్‌‌ ఫిఫ్టీ కంప్లీట్‌‌ చేశాడు. పాండ్యా కూడా 36 బాల్స్‌‌లో హాఫ్‌‌ సెంచరీ అందుకున్నాడు. అయితే,  జోరుమీదున్న ఈ ఇద్దరిని వరుస విరామాల్లో కరన్‌‌ (1/43), స్టోక్స్‌‌ (1/45) విడగొట్టారు. దాంతో, ఐదో వికెట్‌‌కు 99 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగియడంతో టీమ్‌‌ స్కోరు 276/6 అయ్యింది. లోయర్‌‌ ఆర్డర్‌‌లో శార్దూల్‌‌ ఠాకూర్‌‌ (21 బాల్స్‌‌లో 1 ఫోర్‌‌, 3 సిక్సర్లతో 30) ఫైర్‌‌ చూపెట్టాడు. క్రునాల్‌‌ పాండ్యా (25)తో కలిసి ఏడో వికెట్‌‌కు 45 రన్స్‌‌ జోడించాడు.  దాంతో, ఇండియా ఈజీగా 350 ప్లస్​ రన్స్​ చేసేలా కనిపించింది. కానీ, ఆఖర్లో ఇంగ్లండ్​ బౌలర్లు పుంజుకున్నారు.  మార్క్‌‌ వుడ్‌‌ (3/34)  దెబ్బకు  మరో పది బాల్స్ మిగిలుండగానే ఇండియా ఆలౌటైంది. 

కంగారు పెట్టిన కరన్‌‌.. 
భారీ టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో ఇంగ్లండ్‌‌కు తొలుత ఏదీ కలిసి రాలేదు. ఫస్ట్‌‌ ఓవర్‌‌ లాస్ట్‌‌ బాల్‌‌కు రాయ్‌‌ (14)ను ఔట్‌‌ చేసిన భువీ.. తన తర్వాతి ఓవర్‌‌లో బెయిర్‌‌స్టో (1)ను పెవిలియన్‌‌కు పంపి డబుల్‌‌ స్ట్రోక్‌‌ ఇచ్చాడు. 28/2 స్కోరుతో కష్టాల్లో పడిన ఇంగ్లండ్‌‌ను బెన్‌‌ స్టోక్స్‌‌ (35), మలన్‌‌ ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే, హార్దిక్​ క్యాచ్​ డ్రాప్​ చేయడంతో వచ్చిన  లైఫ్​ను ఉపయోగించుకోని స్టోక్స్​.. నటరాజన్‌‌ బౌలింగ్​లో  ధవన్‌‌ చేతికి చిక్కాడు. కొద్దిసేపటికే బట్లర్‌‌ (15)ను ఠాకూర్‌‌ ఔట్‌‌ చేసినా.. మలన్‌‌తో కలిసి లివింగ్‌‌స్టోన్‌‌ (36) నిలకడగా ఆడాడు. వీలైనప్పుడల్లా బాల్‌‌నుబౌండ్రీ దాటించడంతో రన్‌‌రేట్‌‌ తగ్గలేదు. అయితే సెకండ్‌‌ స్పెల్‌‌కు వచ్చిన శార్దూల్‌‌.. డబుల్‌‌ స్ట్రోక్‌‌ ఇచ్చాడు. వరుస ఓవర్లలో లివింగ్‌‌స్టోన్‌‌తో పాటు మలన్‌‌ను ఔట్‌‌ చేశాడు. దాంతో,  ఐదో వికెట్‌‌కు 60  రన్స్​ పార్ట్​నర్​షిప్​ ముగిసింది. ఈ దశలో మొయిన్‌‌ అలీ (29)తో కలిసి కరన్‌‌.. ఇండియాను వణికించాడు. అలీ రెండు సిక్సర్లు కొట్టి ఔటైనా.. లాస్ట్‌‌ బాల్‌‌ వరకు కరన్‌‌ ఇంగ్లండ్‌‌ను రేస్‌‌లో ఉంచాడు. 168/5 స్కోరు వద్ద క్రీజులోకి వచ్చిన కరన్‌‌.. ఇండియా పేస్‌‌ అటాక్‌‌ను సమర్థంగా ఎదుర్కొన్నాడు. 34వ ఓవర్‌‌ (ప్రసీధ్‌‌)లో పాండ్యా క్యాచ్‌‌ మిస్‌‌ చేయడంతో గట్టెక్కాడు. అప్పటికి అతని స్కోరు 22. తర్వాత కూడా కరన్‌‌ భారీ షాట్లతో చెలరేగాడు. ఎనిమిదో వికెట్‌‌కు 57 రన్స్‌‌ జోడించి రషీద్‌‌ (19), ఆ తర్వాత మార్క్‌‌వుడ్‌‌ (14) ఔటైనా.. కరన్‌‌ మాత్రం ఒంటరిగా పోరాడాడు. లాస్ట్‌‌ ఐదు ఓవర్లలో ఇంగ్లండ్‌‌కు 48 రన్స్‌‌ అవసరమయ్యాయి. ఈ దశలో కరన్‌‌ 4, 4, 6, 4తో రెచ్చిపోయాడు. దీంతో లాస్ట్‌‌ 12 బాల్స్‌‌లో 19 రన్స్‌‌ కొట్టాల్సిన దశలో 49వ ఓవర్‌‌లో మార్క్​ వుడ్​, కరన్‌‌ ఇచ్చిన వరుస క్యాచ్‌‌లను ఠాకూర్‌‌, నటరాజన్‌‌ మిస్​ చేశారు. అయితే, నట్టూ వేసిన ఆఖరి ఓవర్​ ఫస్ట్​ బాల్​కే హార్దిక్​ సూపర్​ త్రోతో మార్క్​ వుడ్​​ను రనౌట్​ చేశాడు. మిగతా ఐదు బాల్స్​కు నట్టూ ఐదే రన్స్​ ఇవ్వడంతో ఇండియా గట్టెక్కింది. 

గత 15 ఏళ్లలో ఇండియాలో ఆడిన  ఆరు వన్డే సిరీస్‌‌ల్లోనూ ఓడిన ఇంగ్లండ్‌‌

ఇండియా బ్యాటింగ్: రోహిత్‌‌ (బి) రషీద్‌‌ 37, ధవన్‌‌ (సి అండ్‌‌ బి) రషీద్‌‌ 67, కోహ్లీ (బి) అలీ 7, రిషబ్‌‌ పంత్‌‌ (సి) బట్లర్‌‌ (బి) కరన్‌‌ 78, రాహుల్‌‌ (సి) అలీ (బి) లివింగ్‌‌స్టోన్‌‌ 7, పాండ్యా (బి) స్టోక్స్‌‌ 64, క్రునాల్‌‌ పాండ్యా (సి) రాయ్‌‌ (బి) వుడ్‌‌ 25, శార్దూల్‌‌ ఠాకూర్‌‌ (సి) బట్లర్‌‌ (బి) వుడ్‌‌ 30, భువనేశ్వర్‌‌ (సి) కరన్‌‌ (బి) టోప్లే 3, ప్రసీధ్‌‌ కృష్ణ (బి) వుడ్‌‌ 0, నటరాజన్‌‌ (నాటౌట్‌‌) 0.

ఎక్స్‌‌ట్రాలు: 11, మొత్తం: 48.2 ఓవర్లలో 329.

వికెట్లపతనం: 1–103, 2–117, 3–121, 4–157, 5–256, 6–276, 7–321, 8–328, 9–329, 10–329.

బౌలింగ్‌‌: కరన్‌‌ 5–0–43–1, టోప్లే 9.2–0–66–1, మార్క్‌‌ వుడ్‌‌ 7–1–34–3, స్టోక్స్‌‌ 7–0–45–1, రషీద్‌‌ 10–0–81–2, అలీ 7–0–39–1, లివింగ్‌‌స్టోన్‌‌ 3–0–20–1. 
ఇంగ్లండ్‌‌ బ్యాటింగ్: జేసన్‌‌ రాయ్‌‌ (బి) భువనేశ్వర్‌‌ 14, బెయిర్‌‌స్టో (ఎల్బీ) భువనేశ్వర్‌‌ 1, స్టోక్స్‌‌ (సి) ధవన్‌‌ (బి) నటరాజన్‌‌ 35, మలన్‌‌ (సి) రోహిత్‌‌ (బి) ఠాకూర్‌‌ 50, బట్లర్‌‌ (ఎల్బీ) ఠాకూర్‌‌ 15, లివింగ్‌‌స్టోన్‌‌ (సి అండ్‌‌ బి) ఠాకూర్‌‌ 36, మొయిన్‌‌ అలీ (సి) హార్దిక్‌‌ (బి) భువనేశ్వర్‌‌ 29, కరన్‌‌ (నాటౌట్‌‌) 95, రషీద్‌‌ (సి) కోహ్లీ (బి) ఠాకూర్‌‌ 19, మార్క్‌‌ వుడ్‌‌ (రనౌట్‌‌) 14, టోప్లే (నాటౌట్‌‌) 1,

ఎక్స్‌‌ట్రాలు: 13, మొత్తం: 50 ఓవర్లలో 322/9.

వికెట్లపతనం: 1–14, 2–28, 3–68, 4–95, 5–155, 6–168, 7–200, 8–257, 9–317. బౌలింగ్‌‌: భువనేశ్వర్‌‌ 10–0–42–3, నటరాజన్‌‌ 10–0–73–1, ప్రసీధ్‌‌ కృష్ణ 7–0–62–0, శార్దూల్‌‌ ఠాకూర్‌‌ 10–0–67–4, హార్దిక్‌‌ 9–0–48–0, క్రునాల్‌‌ 4–0–29–0.

 

Tagged Cricket, India, INdia vs England, won, 3rd One Day

Latest Videos

Subscribe Now

More News