
బర్మింగ్ హామ్ : భారత్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇంగ్లండం.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 337 రన్స్ చేసింది. ఇంగ్లండ్ కు మంచి ప్రారంభం దక్కింది. ఓపెనర్లు . బెయిర్ స్టో సెంచరీతో చెలరేగగా ..జాసన్ రాయ్ హాఫ్ సెంచరీ చేశాడు. మరో ఎండ్ లో జో రూట్(40), బెన్ స్టోక్ (79- హాఫ్ సెంచరీ) చెలరేగడంతో ఇంగ్లండ్ భారీ స్కోర్ చేసింది.
ఓ దశలో 400దాకా వెళ్లే స్కోర్ ను మహ్మద్ షమీ కట్టడి చేశాడు. సరైన సమయంలో 5 వికెట్లు తీశాడు. ఇంగ్లండ్ కోల్పోయిన ఏడు వికెట్లలో ఐదు షమీకే దక్కడం గమనార్హం. సెంచరీ వీరుడు బెయిర్ స్టోను ఫస్ట్ వెనక్కి పంపిన షమీ.. ఆ తర్వాత ఇయాన్ మోర్గాన్ (1), జోరూట్ (44), జోస్ బట్లర్ (20), క్రిస్ వోక్స్ (7)లను పెవిలియన్ పంపాడు. దీంతో ఇంగ్లండ్ స్కోరు 337 పరుగులకు పరిమితమైంది.
England finish on 337/7 against India at Edgbaston!
Jonny Bairstow and Jason Roy gave them a blistering start before Mohammed Shami's five-for pegged them back.
But Ben Stokes' 79 has ensured the hosts finish strong.
Can #ViratKohli and his men chase this down?#CWC19 pic.twitter.com/TI8zPMpbev
— Cricket World Cup (@cricketworldcup) June 30, 2019