
మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్న భారత్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌కు ముగ్గురు భారత అంపైర్లను BCCI ప్రకటించింది. ఫిబ్రవరి 5నుంచి ప్రారంభం కానున్న టెస్టు సిరీస్‌కు ICC ప్యానెల్ అంపైర్లు వీరేందర్ శర్మ, అనీల్ చౌదరితో పాటు నితిన్ మేనన్ అంపైర్లుగా వ్యవహరించనున్నారు. ఈ సిరీస్ ద్వారా వీరేందర్ శర్మ, అనిల్ చౌదరి సుదీర్ఘ ఫార్మాట్‌లో ఫీల్డ్ అంపైర్లుగా ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇండియన్ ఎలిట్ ప్యానెల్ ప్రతినిధి నితీన్ కూడా ఐసీసీ ప్యానెల్‌లో భాగమవుతారని BCCI తెలిపింది. నితిన్ మేనన్ గతంలో ఆన్ ఫీల్డ్ అంపైర్‌గా పనిచేశారు. అయితే కరోనా నిబంధనల కారణంగా వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో మ్యాచ్‌లకు ఆతిథ్య దేశ అంపైర్లను ICC ఆమోదించింది. వీరేందర్ శర్మ ఒక T–20 తో పాటు రెండు వన్డేలకు అంపైర్‌గా పనిచేయగా… అనీల్ 20వన్డేలు, 28 T–20 లకు ఫీల్డ్ అంపైర్‌గా వ్యవహరించారు.