
బటుమి (జార్జియా): ఇండియా చెస్ లెజెండ్, తెలుగు గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి.. ఫిడే విమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన సెమీస్ టై బ్రేక్‌లో హంపి 5-3తో లీ టింగ్జీ (చైనా)పై గెలిచింది. ర్యాపిడ్ గేమ్‌ల్లో ఇద్దరు ప్లేయర్ చెరో పది గేమ్‌ల్లో నెగ్గారు. దాంతో 5+3 ఫార్మాట్‌లో రెండో టైబ్రేక్‌ను నిర్వహించారు.
ఇందులో తొలి గేమ్‌లో టింగ్జీ నెగ్గడంతో హంపికి తప్పక గెలవాల్సిన పరిస్థితి తలెత్తింది. అయితే వ్యూహాత్మకంగా ఆడిన తెలుగు గ్రాండ్ మాస్టర్ రెండో గేమ్ నెగ్గి మళ్లీ డ్రా చేసుకుంది. విన్నర్‌ను తేల్చేందుకు 3+2 బ్లిట్జ్ రౌండ్ నిర్వహించారు. ఇందులో టింగ్జీ 44వ ఎత్తు వద్ద చేసిన తప్పిదాన్ని తనకు అనుకూలంగా మల్చుకున్న హంపి విజయం సాధించింది.
రెండో బ్లిట్జ్ గేమ్‌లోనూ తన ఆధిక్యాన్ని నిలబెట్టుకున్న హంపి ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఇండియాకే చెందిన యంగ్ స్టర్ దివ్య దేశ్‌ముఖ్‌తో శని, ఆదివారాల్లో హంపి ఫైనల్లో తలపడనుంది. ఇందులో ఫలితం రాకపోతే 28న టైబ్రేక్స్‌ను నిర్వహిస్తారు. కాగా, ఫైనల్ చేరడంతో హంపి, దివ్య క్యాండిడేట్స్ టోర్నీకి క్వాలిఫై అయ్యారు.