
రాజ్‌గిర్ (బీహార్): ఆసియా కప్ హాకీ టోర్నమెంట్‌లో ఆతిథ్య ఇండియా తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. బలహీన జట్టు కజకిస్తాన్‌పై గోల్స్ వర్షం కురిపించిన హర్మన్‌ప్రీత్ సింగ్ సేన వరుసగా మూడో విజయంతో హ్యాట్రిక్ సాధించింది. సోమవారం జరిగిన పూల్–ఎ మ్యాచ్‌లో ఇండియా 15–-0 తేడాతో కజకిస్తాన్‌ను చిత్తుగా ఓడించింది. దాంతో గ్రూప్‌లో అన్ని మ్యాచ్‌లూ గెలిచిన ఆతిథ్య జట్టు అజేయంగా, అగ్రస్థానంతో సూపర్–4 రౌండ్‌కు దూసుకెళ్లింది. ఈ ఏకపక్ష పోరులో ఇండియా ఆటగాళ్లు గోల్స్‌తో హోరెత్తించారు.
అభిషేక్ (5వ, 8వ, 20వ, 59వ నిమిషాల్లో) ఏకంగా నాలుగు గోల్స్ కొట్టాడు. అతనితో పాటు సుఖ్‌జీత్ సింగ్ (15వ, 32వ, 38వ ని), జుగ్‌రాజ్ సింగ్ (24వ, 31వ, 47వ ని) అద్భుతమైన ఆటతీరు కనబరిచి హ్యాట్రిక్స్ సాధించారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (26వ ని), అమిత్ రోహిదాస్ (29వ ని), రాజిందర్ సింగ్ (32వ ని), సంజయ్ సింగ్ (54వ ని), దిల్‌ప్రీత్ సింగ్ (55వ ని) కూడా ఒక్కో గోల్ రాబట్టారు. ఇండియా డిఫెన్స్ బలంగా ఉండటంతో కజకిస్తాన్ ఒక్కసారి కూడా ఖాతా తెరవలేకపోయింది. ఇదే పూల్‌లో మరో మ్యాచ్‌లో చైనా 2–0తో జపాన్‌ను ఓడించి ముందంజ వేసింది. ఇండియా బుధవారం జరిగే సూపర్–4 మ్యాచ్‌లో సౌత్ కొరియాతో తలపడనుంది. పూల్–బి మ్యాచ్‌ల్లో మలేసియా, కొరియా కూడా విజయం సాధించి సూపర్–4 రౌండ్‌కు క్వాలిఫై అయ్యాయి. మలేసియా15-–0 తో చైనీస్ తైపీ జట్టును మట్టి కరిపించి గ్రూప్‌లో అగ్రస్థానం సాధించింది. మరో మ్యాచ్‌లో కొరియా5–-1 తో బంగ్లాదేశ్‌పై విజయం సాధించి రెండో ప్లేస్‌తో ముందంజ వేసింది. మొత్తంగా సూపర్– 4 రౌండ్‌కు చేరుకున్న నాలుగు జట్లు (ఇండియా, చైనా, మలేసియా, కొరియా) ఈ దశలో ఒకదానితో మరకొటి తలపడతాయి. అందులో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఆదివారం జరిగే ఫైనల్ చేరుకుంటాయి.