ఇండియాకు ఎదురుందా? ..ఇవాళ(అక్టోబర్ 30) న్యూజిలాండ్‌‌‌‌తో  నాలుగో టీ20 మ్యాచ్‌‌‌‌

ఇండియాకు ఎదురుందా? ..ఇవాళ(అక్టోబర్ 30) న్యూజిలాండ్‌‌‌‌తో  నాలుగో టీ20 మ్యాచ్‌‌‌‌
  • కుల్దీప్‌‌‌‌, వరుణ్‌‌‌‌కు చాన్స్‌‌‌‌!
  • గెలుపే లక్ష్యంగా కివీస్‌‌‌‌.. మ. 12.30 నుంచి సోనీ స్పోర్ట్స్‌‌‌‌లో లైవ్‌‌‌‌

 

ఆక్లాండ్‌‌‌‌: విధ్వంసకర బ్యాటింగ్‌‌‌‌తో రికార్డులు కొల్లగొడుతున్న ఇండియా.. న్యూజిలాండ్‌‌‌‌తో నాలుగో టీ20 మ్యాచ్‌‌‌‌కు రెడీ అయ్యింది. శుక్రవారం జరిగే ఈ మ్యాచ్‌‌‌‌లోనూ గెలిచి సిరీస్‌‌‌‌ క్లీన్‌‌‌‌స్వీప్‌‌‌‌ దిశగా మరో అడుగు ముందుకేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఐదు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌ను ఇప్పటకే 3–0తో సొంతం చేసుకున్న టీమిండియా.. చివరి రెండు మ్యాచ్‌‌‌‌ల్లోనూ తమ బ్యాటింగ్‌‌‌‌ పవర్‌‌‌‌ చూపెట్టాలని యోచిస్తోంది. అయితే టీ20ల తర్వాత వన్డే, టెస్ట్‌‌‌‌ సిరీస్‌‌‌‌లు ఉన్న నేపథ్యంలో కీలక ప్లేయర్లకు విశ్రాంతి ఇవ్వాలన్న ఆలోచనలోనూ ఉంది. బ్యాటింగ్‌‌‌‌లో పెద్దగా మార్పులు చేయకుండా బౌలింగ్‌‌‌‌లో ఒకటి, రెండు ప్రత్యామ్నాయాలను పరీక్షించాలని మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ భావిస్తోంది. మరోవైపు కనీసం ఈ మ్యాచ్‌‌‌‌లోనైనా గెలిచి సొంత గడ్డపై పరువు దక్కించుకోవాలని కివీస్‌‌‌‌ ప్రయత్నాలు చేస్తోంది. 

తుది జట్టులో ఎవరు?

మూడో టీ20లో పవర్‌‌‌‌ప్లే విధ్వంసం చూసిన తర్వాత టీమిండియా బ్యాటింగ్‌‌‌‌పై ఎలాంటి అనుమానాలు లేవు. కాబట్టి ఇప్పుడున్న లైనప్‌‌‌‌తోనే బరిలోకి దిగే చాన్స్‌‌‌‌ ఉంది. అదే జరిగితే అభిషేక్‌‌‌‌, వైభవ్‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌ సునామీతో ఆక్లాండ్‌‌‌‌లోని ఇండియన్‌‌‌‌ ఫ్యాన్స్‌‌‌‌ హోరెత్తడం ఖాయం. కెప్టెన్‌‌‌‌ శ్రేయస్‌‌‌‌ అయ్యర్‌‌‌‌ ఫామ్‌‌‌‌ పైనే కాస్త ఆందోళన కనిపిస్తోంది. బౌలింగ్‌‌‌‌లో చైనామన్‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌ కుల్దీప్‌‌‌‌ యాదవ్‌‌‌‌, వరుణ్‌‌‌‌ చక్రవర్తిలకు అవకాశం కల్పించొచ్చు. ఒకవేళ ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ నితీష్‌‌‌‌ కుమార్‌‌‌‌కు రెస్ట్‌‌‌‌ ఇస్తే శివమ్‌‌‌‌ దూబేను తుది జట్టులోకి తీసుకొచ్చు. పేసర్‌‌‌‌ ప్రిన్స్‌‌‌‌ యాదవ్‌‌‌‌ను పక్కనబెట్టి మయాంక్‌‌‌‌ యాదవ్‌‌‌‌ను మరోసారి పరిశీలించాలని మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ యోచిస్తోంది. రెండు, మూడో టీ20లకు దూరంగా ఉన్న ఇషాన్‌‌‌‌ కిషన్‌‌‌‌ గ్రోయిన్‌‌‌‌ ఇంజ్యురీ నుంచి కోలుకున్నాడో లేదో చూడాలి. ఒకవేళ పూర్తి ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌తో ఉంటే బరిలోకి దించుతారా? రెస్ట్‌‌‌‌ ఇస్తారా? చూడాలి. 

కివీస్‌‌‌‌కు గాయాలబెడద..

ఇప్పటికే సిరీస్‌‌‌‌ను చేజార్చుకున్న కివీస్‌‌‌‌ను గాయాలబెడద పీడిస్తోంది. తాజాగా ఫెర్గుసన్‌‌‌‌ కూడా గాయం బారినపడ్డాడు. దాంతో మిగిలిన రెండు మ్యాచ్‌‌‌‌లకు దూరమయ్యాడు. అతని స్థానంలో మ్యాట్‌‌‌‌ ఫిషర్‌‌‌‌ను జట్టులోకి తీసుకున్నారు. ఒకవేళ పేస్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లో మార్పులు జరిగితే బ్లెయిర్‌‌‌‌ టక్నెర్‌‌‌‌కు ఆడే చాన్స్‌‌‌‌ రావొచ్చు. స్పిన్నర్‌‌‌‌ శాంట్నర్‌‌‌‌ అనుకున్న స్థాయిలో రాణిస్తున్నాడు. బ్యాటింగ్‌‌‌‌లో డారిల్‌‌‌‌ మిచెల్‌‌‌‌, ఫిన్‌‌‌‌ అలెన్‌‌‌‌ ఫామ్‌‌‌‌లో ఉండటం కలిసొచ్చే అంశం. సీఫెర్ట్‌‌‌‌, గ్లెన్‌‌‌‌ ఫిలిప్స్‌‌‌‌, బెవాన్‌‌‌‌ జాకబ్స్‌‌‌‌ కూడా బ్యాట్లు ఝుళిపిస్తే భారీ స్కోరును ఆశించొచ్చు. 


తుది జట్లు (అంచనా):

ఇండియా: శ్రేయస్‌‌‌‌  (కెప్టెన్‌‌‌‌), అభిషేక్‌‌‌‌, వైభవ్‌‌‌‌, శాంసన్‌‌‌‌, తిలక్‌‌‌‌, నమన్‌‌‌‌ ధీర్‌‌‌‌, నితీష్‌‌‌‌  / శివమ్‌‌‌‌ దూబే, అక్షర్‌‌‌‌ / కుల్దీప్‌‌‌‌ / వరుణ్‌‌‌‌ చక్రవర్తి, భువనేశ్వర్‌‌‌‌, ప్రిన్స్‌‌‌‌ యాదవ్‌‌‌‌, అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌ సింగ్‌‌‌‌ / మయాంక్‌‌‌‌ యాదవ్‌‌‌‌. 

న్యూజిలాండ్‌‌‌‌: శాంట్నర్‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌), ఫిన్‌‌‌‌ అలెన్‌‌‌‌, టిమ్‌‌‌‌ సీఫెర్ట్‌‌‌‌, డారిల్‌‌‌‌ మిచెల్‌‌‌‌, గ్లెన్‌‌‌‌ ఫిలిప్స్‌‌‌‌, బెవాన్‌‌‌‌ జాకబ్స్‌‌‌‌, మైకేల్‌‌‌‌ బ్రాస్‌‌‌‌వెల్‌‌‌‌, ఆడమ్‌‌‌‌ మిల్నే, జాకబ్‌‌‌‌ డఫీ, మ్యాట్‌‌‌‌ ఫిషర్‌‌‌‌, బ్లెయిర్‌‌‌‌ టక్నెర్‌‌‌‌ / నేథన్‌‌‌‌ స్మిత్‌‌‌‌.


1 అంతర్జాతీయ టీ20ల్లో 150 వికెట్ల మైలురాయిని చేరడానికి అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌ ఒక్క వికెట్‌‌‌‌ దూరంలో ఉన్నాడు. ఈ వికెట్‌‌‌‌ పడగొడితే ఇండియా తరఫున ఈ ఫీట్‌‌‌‌ అందుకున్న తొలి బౌలర్‌‌‌‌గా రికార్డులకెక్కుతాడు.

1 మిచెల్‌‌‌‌ శాంట్నర్‌‌‌‌ కూడా 150 వికెట్ల  మైలురాయికి వికెట్‌‌‌‌ దూరంలో ఉన్నాడు. కివీస్‌‌‌‌ తరఫున ఈ ఘతన సాధించిన మూడో బౌలర్‌‌‌‌గా నిలుస్తాడు. ఇష్‌‌‌‌ సోధీ, టిమ్‌‌‌‌ సౌథీ ముందున్నారు.