తీరు మారలే…90 పరుగులకే ఆరు వికెట్లు

తీరు మారలే…90 పరుగులకే ఆరు వికెట్లు

న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో ఇండియా ఆటతీరు మారడం లేదు. మొదటి ఇన్నింగ్స్ లో  న్యూజిలాండ్ 235 పరుగులకు ఆలౌట్ కావడంతో  ఇండియాకు 7 పరుగుల ఆధిక్యం లభించింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసిన ఇండియా 90 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఒకరి తర్వాత ఒకరు తక్కువ స్కోర్ కే పెవిలియన్ బాటపట్టారు. ఒపెనర్ పృథ్విషా 14, మయాంక్ అగర్వాల్ 3 మరోసారి విఫలమయ్యారు.  పూజారా కూడా 24 పరుగులకే ఔట్ అయ్యాడు. ఇక కెప్టెన్ వీరాట్ కోహ్లీ తన ఫెలవమైన ఫామ్ ను కొనసాగిస్తున్నాడు.14 పరుగులకే ఔటై మరోసారి నిరాశపర్చాడు. న్యూజిలాండ్ టూర్ లో ఒక్క హాఫ్ సెంచరీ మినహా కోహ్లీ బ్యాటింగ్ లో  ఘోరంగా విఫలమయ్యాడు. వైస్ కెప్టెన్ అజింక్య రహానే 9, ఉమేశ్ యాదవ్ 1పరుగులకే వెనుదిరిగారు. ప్రస్తుతం హనుమవిహారి 5 ,రిషబ్ పంత్ 1 పరుగులతో క్రీజులో ఉన్నారు.  దీంతో రెండో రోజు ఆట ముగిసే సరికి టీమిండియాకు 97 పరుగుల ఆధిక్యం లభించింది. న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెన్ట్ బౌల్ట్ కు 3, నీల్ వాగ్నెర్ , టిమ్ సౌథీ,కొలిన్ గ్రంథమ్ లకు తలో ఒక వికెట్ పడ్డాయి.