ఇండియా vs పాకిస్థాన్..ఇవాళ అండర్-19 సెమీ ఫైనల్

ఇండియా vs పాకిస్థాన్..ఇవాళ అండర్-19 సెమీ ఫైనల్

అద్వితీయ విజయాలతో దూసుకుపోతున్నటీమిండియా కుర్రాళ్లు.. అండర్‌ –19 వరల్డ్‌‌కప్‌ లోకీలక పోరుకు సిద్ధమయ్యారు . మంగళవారం జరిగే సెమీస్‌ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌‌తో అమీతుమీ తేల్చుకోనున్నారు . ఇప్పటికే నాలుగుసార్లు చాంపియన్‌‌గా నిలిచిన ఇండియా..సెమీస్‌ లో నెగ్గితే వరుసగా మూడుసార్లు ఫైనల్‌ కుచేరిన టీమ్‌ గా రికార్డులకెక్కుతుంది. ఏ లెవల్‌క్రికెట్‌ లోనైనా ఇండోపాక్‌ తో మ్యాచ్‌ అంటే దానికి ఉండే క్రేజ్‌ అంతా ఇంతా కాదు. ఆటగాళ్లపై కూడా అధిక ఒత్తిడి నెలకొని ఉంటుంది.ఈ నేపథ్యంలో ఇరుజట్లలో ఎవరూ రాణించినా ఓవర్‌ నైట్‌ స్టార్‌ లుగా మారిపోతారు. కాబట్టి ప్రతిప్లేయర్‌ ఈ మ్యాచ్‌ లో తమ సత్తా ఏంటో చూపాలని ప్రత్యేకంగా ప్లాన్స్‌ వేసుకుంటారు. ఇక రికార్డుల పరంగా చూసుకున్నా.. ఐసీసీ ఈవెంట్లలో టీమిండియా సీనియర్‌ జట్టును పాక్‌ ఓడించిన దాఖలాలు లేవు. సేమ్‌ జూనియర్‌ స్థాయిలో కూడా అదే రికార్డు కొనసాగుతోంది. గతేడాది ఆసియాకప్‌ లో పాక్‌ పై గెలిచిన ఇండియా కుర్రాళ్లు విజేతలుగా నిలిచారు.

డిఫెండింగ్‌ చాంపియన్‌‌ హోదాలో బరిలోకి దిగుతున్న టీమిండియా.. 2018 ఎడిషన్‌‌లో పాక్‌ ను 203 రన్స్‌ తేడాతో ఓడించింది. క్వార్టర్‌ ఫైనల్లో బలమైన ఆసీస్‌ ను ఓడించి సెమీస్‌ కు దూసుకొచ్చిన ఇండియా సూపర్‌ ఫామ్‌లో ఉంది. ప్రియమ్‌ గార్గ్‌‌ నేతృత్వంలోని టీమ్‌ అన్ని రంగాల్లో రాణిస్తుండటం లాభించే అంశం. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ .. ఇండియా బ్యాటింగ్‌ కు బ్యాక్‌ బోన్‌‌గా నిలుస్తున్నాడు. నాలుగు మ్యాచ్‌ ల్లో మూడుహాఫ్‌ సెంచరీలు చేయడమే ఇందుకు నిదర్శనం.లోయర్‌ ఆర్డర్‌ లో పరుగులు చేసే బ్యాట్స్‌ మన్‌‌ లేకపోవడం లోటుగా కనిపిస్తోంది. బౌలింగ్‌ లో పేసర్‌ కార్తీక్‌ త్యాగీ మరోసారి కీలకం కానున్నాడు.అథర్వ అంకోలేకర్‌ , లెగ్గీ రవి బిష్ణోయ్‌ మరోసారి చెలరేగితే పాక్‌ కు కష్టాలు తప్పవు. మరోవైపు పాక్‌పేసర్లు అబ్బాడ్స్‌ , ఆమిర్‌ ఖాన్‌‌, తాహిర్‌ హుస్సేన్‌‌ నుంచి ఇండియాకు ప్రమాదం పొంచి ఉంది. ఓపెనర్‌ హురైనా ఫామ్‌ లో ఉండటం పాక్‌ కు కలిసొచ్చే అంశం.

మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి